కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు..... WHO కొవిడ్ శాస్త్రవేత్త సంచలన కామెంట్స్...

Corona Lockdown | Corona Update : కరోనాపై పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా 102 వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: May 6, 2020, 6:43 AM IST
కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు..... WHO కొవిడ్ శాస్త్రవేత్త సంచలన కామెంట్స్...
కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు..... WHO కొవిడ్ శాస్త్రవేత్త సంచలన కామెంట్స్... (credit - twitter - Dr David Nabarro)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఓవైపు కరోనాకి ఆగస్ట్ కల్లా వ్యాక్సిన్ తయారవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్, డిసెంబర్ కల్లా తయారవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాళ్లు చెబుతుంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని కరోనా ఎనలిస్ట్ డేవిడ్ నబారో మాత్రం కరోనా వైరస్‌కి ఎప్పటికీ వ్యాక్సిన్ రాకపోవచ్చు అని అంటున్నారు. "అదేంటి ఆయన అలా ఎందుకంటున్నాడు" అని ఇప్పుడు చాలా మంది విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 102 కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో 8 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఈ 102లో ఏదైనా ఒక్కటి పనిచేసినా... కరోనా పని అయిపోయినట్లే. కానీ డేవిడ్ నబారో మాత్రం నిరాశతో ఉన్నారు.

నబారో ఎందుకలా అంటున్నారంటే... ఇప్పటికే ప్రపంచంలో ఎయిడ్స్, డెంగ్యూ, సార్స్ లాంటి వైరస్‌లకు వ్యాక్సిన్లు లేవు. ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వాటికి ఎన్ని ప్రయోగాలు చేసినా... ఆ వైరస్‌కి చెక్ పెట్టలేకపోయారు. ఇక సార్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపట్టినా... అది దానంతట అదే తగ్గడంతో... ప్రయోగాల్ని తొలిదశలోనే ఆపేశారు. ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్... దాదాపు సార్స్ వైరస్‌కి దగ్గర పోలికలతో ఉంది. అందువల్ల సార్స్‌కి వైరస్‌ కనిపెట్టి ఉంటే... అది కరోనాకీ చెక్ పెట్టి ఉండేదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అంత త్వరగా లొంగేలా కనిపించట్లేదు. అందుకే డేవిడ్ నబారో... ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

వ్యాక్సిన్ తయారీలో చాలా దశలుంటాయి. జంతువులపై ప్రయోగాల సంగతి పక్కన పెడితే... మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాల్లో కూడా చాలా దశలుంటాయి. మొదటి దశలో వ్యాక్సిన్ ఇస్తే... అది ఆ మనిషికి ఏదైనా ప్రమాదకరమా అన్నది చూస్తారు. ఆ తర్వాత... ఆ వ్యాక్సిన్ వైరస్‌ని చంపుతుందా లేదా అన్నది చూస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ వల్ల మనిషికి దీర్ఘకాలిక సమస్యలేమైనా వస్తాయా అన్నది చూస్తారు. అలాగే... వ్యాక్సిన్ ఇస్తే... ఇతర ఆల్రెడీ ఉన్న జబ్బులపై ఎలాంటి ప్రభావం ఉంది అన్నది చూస్తారు. అలాగే వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తోంది అన్నది చూస్తారు. ఇలా చాలా లెక్కలుంటాయి. వీటిలో ఏ ఒక్కటి సెట్ కాకపోయినా... ఆ వ్యాక్సిన్ తయారీ ఆపేస్తారు. అందుకే డేవిడ్ నబారో... వ్యాక్సిన్ తయారీ అంత తేలిక కాదంటున్నారు.

మీకు తెలిసే ఉంటుంది... ఎయిడ్స్ వల్ల ఏటా 3.2 కోట్ల మంది చనిపోతున్నారు. అలాగే ఏటా 4 లక్షల మందికి డెంగ్యూ సోకుతోంది. డెంగ్యూకి వ్యాక్సిన్ తయారయ్యేలా చాలాసార్లు కనిపించినా... పైన మనం చెప్పుకున్న దశల్లో కొన్ని ఫెయిలవుతూ... మొత్తంగా ప్రయత్నాల్ని నీరుగార్చేస్తున్నాయి.

మరో విషయమేంటంటే... సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఆగస్ట్ కల్లా... వ్యాక్సిన్ తయారవ్వడం అన్నది కూడా చాలా కష్టమైన అంశం. ఎందుకంటే... మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తవడానికి 6 నెలల దాకా పడుతుంది. ఆ ప్రయోగాల్లో సక్సెస్ అయితే... అప్పుడు వ్యాక్సిన్‌ తయారీకి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ తర్వాత... ల్యాబుల్లో కృత్రిమంగా ఆ వ్యాక్సిన్ తయారుచెయ్యాల్సి ఉంటుంది. అలా వ్యాక్సిన్ తయారవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది. కాకపోతే... ఇప్పటికే చాలా ప్రయోగ దశలు పూర్తవడం వల్ల సీఎం కేసీఆర్... వ్యాక్సిన్ ఆగస్ట్ కల్లా వస్తుందనే నమ్మకంతో ఉండి ఉండొచ్చని తెలుస్తోంది.


ఒకవేళ వ్యాక్సిన్ తయారవ్వకపోతే... ఇక ఎయిడ్స్, డెంగ్యూ, సార్స్ తరహాలో... ఈ కరోనాను కూడా భరించక తప్పదు. అది కూడా రెగ్యులర్ జ్వరాలు, జలుబుల్లా వస్తూనే ఉంటుంది. మనమే అన్ని జాగ్రత్తలూ తీసుకోక తప్పదనుకోవాలి.
Published by: Krishna Kumar N
First published: May 6, 2020, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading