Corona Vaccine : భారత్‌లో కరోనా ఎలా పెరుగుతోంది? వ్యాక్సిన్ల తయారీ ఎంతవరకూ వచ్చింది?

Corona Lockdown | Corona Update : కరోనా తొలి కేసు నమోదై ఆరు నెలలు దాటేసింది. మరి వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయా? ముందుగా వచ్చేది ఏది?

news18-telugu
Updated: June 3, 2020, 11:02 AM IST
Corona Vaccine : భారత్‌లో కరోనా ఎలా పెరుగుతోంది? వ్యాక్సిన్ల తయారీ ఎంతవరకూ వచ్చింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇండియాలో ఫిబ్రవరి 15న కేరళలో తొలిసారిగా 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మార్చి 14 అంటే... నెల రోజులకు కేసులు 100కు చేరాయి. మార్చి 29కి వెయ్యి కేసులయ్యాయి. అంటే... వంద నుంచి వెయ్యి అవ్వడానికి పట్టిన కాలం... 15 రోజులు. అలాగే... ఏప్రిల్ 13 నాటికి ఇండియాలో కరోనా కేసులు 10 వేలు దాటాయి. అంటే... 15 రోజుల్లో 900 వందల కేసులు పెరిగాయి. అదే ఎక్కువనుకుంటే... మే 6 నాటికి ఇండియాలో పాజిటివ్ కేసులు... 52987 అయ్యాయి. అంటే... 10వేల నుంచి 50వేలు దాటేందుకు పట్టిన కాలం... 23 రోజులు మాత్రమే. ఇక... లక్షకు చేరువైంది మే 18న. అంటే... మొదటి లక్ష కేసులు నమోదవ్వడానికి పట్టిన కాలం... దాదాపు 3 నెలలు. కానీ... లక్ష నుంచి 2 లక్షలు దాటేందుకు పట్టిన కాలం కేవలం 14 రోజులు మాత్రమే. మరి 3 లక్షలకు చేరువయ్యేందుకు ఇంకా ఎంత తక్కువ కాలం పడుతుందో అనేది ఆందోళన కలిగించే అంశం.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచదేశాలకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ కావాలి. ప్రపంచ దేశాల్లో కరోనా వచ్చి 6 నెలలు దాటింది. 60 లక్షల మందికి పైగా కరోనా సోకింది. వారిలో 31 లక్షల మందికి ఇప్పుడు కరోనా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 110 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల తయారీ చేపట్టాయి. కొన్ని తొలిదశలో సక్సెస్ అయ్యి... సెకండ్ దశకు చేరాయి. కొంత మంది ఇతర మందులతో కరోనాను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇండియాలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ :
భారత వైద్య పరిశోధనా మండలితో కలిసి వ్యాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్... ప్రస్తుతానికి వ్యాక్సిన్ తయారీలో సంతృప్తిగానే ఉంది. మనుషులపై ట్రయల్ ఎంతవరకూ వచ్చాయో చెప్పలేదుగానీ... వచ్చే నెల తమకు అత్యంత కీలకం అని చెబుతోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ తయారవుతోంది. ఎలా చూసినా ఈ వ్యాక్సిన్ డోసుల తయారీకి కనీసం 6 నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటూ... ఇండియాలో మరో 7 కంపెనీలు కూడా వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. వీటి తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి వ్యాక్సిన్ తయారుచేస్తోంది.

రెండో దశకి చేరిన మోడెర్నా :
అమెరికా కంపెనీ మోడెర్నా థెరాప్యూటిక్... mRNA-1273 అనే వ్యాక్సిన్ తయారుచేస్తోంది. ఇది కచ్చితంగా తయారయ్యే వ్యాక్సిన్ అనే నమ్మకం ప్రపంచదేశాలకు కలుగుతోంది. ఇప్పటికే తొలిదశ సక్సెస్ అయ్యి... రెండో దశ పరీక్షలు మొదలుకావాల్సి ఉంది. 600 మందికి డోసులు ఇవ్వబోతోంది. తొలిదశ పరీక్షల్లో... వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత... పేషెంట్లలో యాంటీబాడీస్... అత్యంత వేగంగా వృద్ధి చెందాయి. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే అంటున్నారు. ఐతే... ఓ పేషెంట్‌కి మాత్రం వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చాక... దద్దుర్లు, వికారం, కండరాల నొప్పి లాంటివి వచ్చాయి.

టాబ్లెట్ తెస్తున్న రష్యా :రష్యా మాత్రం... కరోనా డ్రగ్ (ట్యాబ్లెట్) తయారుచేస్తోంది. జూన్ 11న ఎవిఫావిర్ (Avifavid) మందును పేషెంట్లకు ఇవ్వనుంది. ఇది సక్సెస్ అయితే... కరోనాకు తొలి టాబ్లెట్ ఇదే అవుతుంది. వ్యాక్సిన్ కన్నా టాబ్లెట్ల తయారీ అత్యంత వేగంగా పూర్తవుతుంది కాబట్టి... ఈ మందుపైనా ఆశలున్నాయి. సైబీరియాలోని వెక్టర్ ఇన్‌స్టిట్యూట్ దీన్ని తయారుచేసింది. ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ప్రయోగాలు పూర్తి కానున్నాయి.

చైనాలోని సినోవాక్ సూపర్ సక్సెస్ :
చైనా కంపెనీ సినోవాక్ బయోటెక్... కరోనావాక్ అనే వ్యాక్సిన్ తయారుచేస్తోంది. ఇది కరోనాను 99 శాతం తరిమేస్తుందని చెబుతున్నారు. మొదటి దశ ప్రయోగాలు కోతులపై విజయవంతం కావడంతో... రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలో బ్రిటన్‌లో మూడో దశ ట్రయల్స్ జరగనున్నాయి.

డిసెంబర్ నాటికి వ్యాక్సిన్? :
చైనాలో ఇలా చాలా కంపెనీలు మనుషులపై వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నాయి. బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ కంపెనీ కలిసి వ్యాక్సిన్ తయారుచేసి... రెండోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నాయి.

కాన్సినో వ్యాక్సిన్ :
చైనాలో తయారవుతున్న మరో వ్యక్సిన్ కాన్సినో వ్యాక్సిన్. ఇది కూడా బాగుంది. తొలి దశలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి... కీలకమైన టీ సెల్స్ ఉత్పత్తి అయ్యాయి. ఇప్పుడు రెండోదశ ప్రయోగాలు చేస్తోంది.
First published: June 3, 2020, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading