కళ్ల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్....

Corona Lockdown | Corona Update : కళ్ల ద్వారా ఒకప్పుడు సార్స్ వైరస్ వ్యాపించినదాని కంటే... 100 రెట్లు ఎక్కువగా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తాజాగా తెలిసింది.

news18-telugu
Updated: May 9, 2020, 8:28 AM IST
కళ్ల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్....
మనిషిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారికి కరోనా వైరస్ సోకే లక్షణాలు తక్కువ అంటూ వైద్యులు చెబుతున్నారు.
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇప్పటివరకూ మనం కరోనా వైరస్... ముక్కు, నోటి ద్వారా ఎక్కువగా వ్యాపిస్తోందని అనుకున్నామా. హాంకాంగ్ పరిశోధకులు ఈ వారం సంచలన విషయం చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించడానికి అసలు కారణం కళ్లు అని చెప్పారు. ఇదివరకు వచ్చిన సార్స్, బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించినదాని కంటే... ఎక్కువగా కరోనా వైరస్... కళ్లు, గాలి ద్వారా వ్యాపిస్తోందని తేల్చారు. మన కళ్లపై కంజంక్టివా (Conjunctiva) అనే సన్నటి, స్పష్టమైన కణజాలం ఉంటుంది. ఇది కంటిని కప్పి ఉంటుంది. దీనిపై కరోనా వైరస్ దాడి చేస్తోంది. ఇదివరకు సార్స్ వైరస్ ఇలా చేసిన దాడి కంటే... కరోనా దాడి 100 రెట్లు ఎక్కువగా ఉందని హాంకాంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనా బృందం తేల్చింది. ఈ వివరాల్ని ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో తెలిపింది.

ప్రపంచం అనుకుంటున్నట్లు ముక్కు, నోరు కంటే... కళ్ల ద్వారానే ఈ వైరస్ ఎక్కువగా బాడీలోకి ప్రవేశిస్తోందని తమ పరిశోధనను బట్టీ అర్థమవుతోందని హాంకాంగ్ టీమ్ తెలిపింది. కళ్లలోని కంజక్టివాను మైక్రోస్కోప్‌లో టెస్టు చెయ్యగా... ఇదివరకు అదే ప్రదేశంలో సార్స్ వైరస్ ఏ స్థాయిలో ఉందో... అంతకు 80 నుంచి 100 రెట్లు ఎక్కువగా కరోనా వైరస్ అక్కడ ఉందని పరిశోధకులు తెలిపారు.

2000 సంవత్సరంలో వచ్చిన సార్స్... 8వేల మందికి సోకింది. 700 మంది దాకా చనిపోయారు. కానీ... అదే సార్స్ లక్షణాలతో ఉన్న కరోనా వైరస్ ఏకంగా 40 లక్షల మందికి పైగా సోకింది. రెండు వైరస్‌లూ ఒకే లాంటివి అయినప్పుడు... ఈ కరోనా ఎందుకు ఇంతలా వ్యాపించిందన్న ప్రశ్నకు సమాధానం కళ్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే... ప్రపంచం మొత్తం ముక్కు, నోరు మూసుకుంటున్నారు గానీ... కళ్లను పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్... ఆ కళ్ల ద్వారానే కరోనా లోపలికి వెళ్లిపోతోందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇంతకుముందు... ఇటలీలో ఓ మహిళకు డాక్టర్లు.... ముక్కులో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయేలా చేశారు. కానీ... ఆమె ఆస్పత్రిలో చేరిన 27వ రోజున... ఆమె కళ్లలో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. షాకైన డాక్టర్లు అప్పటి నుంచి కళ్లపైనా దృష్టి పెట్టారు.

హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే... ముక్కు, నోటితోపాటూ... కళ్లకు కూడా పెద్ద సైజు కళ్లజోడు పెట్టుకోవాలని చెబుతున్నారు. అసలు చేతుల్ని ముఖానికి టచ్ చెయ్యకపోవడం 100 శాతం బెటర్ అంటున్నారు. ఈ విషయం డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సంస్థ ఎప్పుడో చెప్పింది.
Published by: Krishna Kumar N
First published: May 9, 2020, 8:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading