కరోనాకు మరో మందు... సిప్రెమీని ప్రారంభించిన సిప్లా... ఎలా పనిచేస్తుందంటే...

కరోనాకు మరో మందు... సిప్రెమీని ప్రారంభించిన సిప్లా... ఎలా పనిచేస్తుందంటే...

కరోనాకు మరో మందు... సిప్రెమీని ప్రారంభించిన సిప్లా... (credit - twitter - cipla global)

Corona Lockdown | Corona Update : కరోనాకి వ్యాక్సిన్ తయారవ్వడానికి మరో ఆరు నెలలు పడుతుంది. ఈలోగా ఫార్మా కంపెనీలన్నీ మందులతో ముందుకొస్తున్నాయి.

 • Share this:
  Corona Lockdown | Corona Update : కరోనాకు మందు లేదు అని ఇన్నాళ్లూ అనుకున్నాం మరి ఇప్పుడో... ఫాబిఫ్లూ (FabiFlu), కోవిఫోర్ (Covifor) వచ్చేశాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఇండియన్ ఫార్మా కంపెనీ సిప్లా... సిప్రెమీ (Cipremi) పేరుతో మరో మందును తెచ్చింది. కోవిఫోర్‌ను హెటెరో ఫార్మా కంపెనీ... రెమ్‌డెసివిర్‌తో తయారుచేయగా... సిప్లా కూడా అదే రెమ్‌డెసివిర్‌తో... సిప్రెమీని తయారుచేసింది. ఇది కూడా కోవిఫోర్ లాగా... ఇంజెక్షన్ లాగే ఉంటుంది. ఈ రెండు కంపెనీలూ... కలిసి ఈ మందును ఉత్పత్తి చేశాయి. రెండింటికీ తయారీ, మార్కెట్ చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. రెండు కంపెనీలూ... వేర్వేరు పేర్లతో ఇంజెక్షన్‌ను తయారుచేశాయి. తమ సొంతంగా, ఇతర సంస్థలతో కలిసి... సిప్రెమీని ఉత్పత్తి చేస్తామని ముంబైకి చెందిన సిప్లా తెలిపింది.

  ఫాబిఫ్లూ అనే టాబ్లెట్లు... కరోనా చాలా తక్కువగా, మధ్యస్థాయిలో ఉన్నవారికి ఇచ్చేందుకు వీలవ్వనుండగా... ఈ కోవిఫోర్, సిప్రెమీ ఇంజెక్షన్లను కరోనా చాలా ఎక్కువగా అంటే ఆక్సిజన్ సపోర్టుతో ట్రీట్‌మెంట్ పొందుతున్నవారికి ఇవ్వొచ్చని తెలిసింది. పెద్దవాళ్లు, పిడియాట్రిక్ పేషెంట్లకు దీన్ని ఇవ్వొచ్చని కంపెనీ వివరించింది.

  హెటెరో తయారుచేసిన కోవిఫోర్... 100 మిల్లీగ్రాముల బాటిల్... రూ.5000 నుంచి రూ.6000 ఉంటుందని తెలిసింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం... కరోనా పేషెంటలకు తొలి రోజు ఈ 200 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ ఇవ్వొచ్చు. ఆ తరవాత వరుసగా ఐదు రోజులపాటూ... రోజూ 100 మిల్లీగ్రాములు ఇవ్వొచ్చంటున్నారు. అంటే... ఒక్కో పేషెంట్‌కీ... 7 బాటిళ్లు అవసరం. ఒక్కో బాటిల్ ధర రూ.5000 అనుకుంటే... మొత్తం రూ.35వేలు ఖర్చవుతుంది. ఫాబిఫ్లూ టాబ్లెట్లతో ట్రీట్‌మెంట్ చేయాలనుకుంటే... వాటికి రూ.14వేలు ఖర్చవుతుందని తెలిసింది. ఫాబిఫ్లూతో కరోనా తగ్గకపోతే... అప్పుడు ఈ ఇంజెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా అసలు ఫాబిఫ్లూ వాడకుండా... డైరెక్టుగా ఇంజెక్షన్లనే ట్రీట్‌మెంట్‌గా ఇచ్చే అవకాశమూ ఉంది. సిప్లా కంపెనీ.. తమ సిప్రెమీ రేటు ఎంతో ఇంకా చెప్పలేదు.

  అమెరికాలో FDA... కరోనా పేషెంట్లకు రెమ్‌డెసివిర్‌ను కరోనాతో బాధపడుతున్న పెద్దవాళ్లకు, పిడియాట్రిక్ పేషెంట్లకు ఇవ్వొచ్చని అనుమతించింది. అందువల్ల ఇది కరోనాకి సరైన మందుగా ప్రస్తుతానికి భావిస్తున్నారు. మన దేశంలో DCGI... సిప్లా డ్రగ్‌ను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే వాడాలని చెప్పింది. అంటే... కరోనా అంతంతమాత్రంగా ఉండేవారికి సిప్రెమీ ఇవ్వకూడదన్నది ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే... రెమ్‌డెసివిర్ అనేది చాలా పవర్‌ఫుల్ మందు కావడమే.


  ఇప్పటికే సిప్లా... మూడు ట్రయల్స్ పూర్తి చేసింది. త్వరలో డ్రగ్ సరఫరా చేసి... ఆ తర్వాత నాలుగో క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తామని తెలిపింది. సిప్లా తన ట్రయల్ 1లో అమెరికా, యూరప్, ఆసియాలో 60 చోట్ల... 1063 మంది పేషెంట్లపై (ఎక్కువ మంది ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నవారు)... డ్రగ్‌ను పరీక్షించింది. చాలా త్వరగా పేషెంట్లు కోలుకున్నట్లు గుర్తించింది. మరణాల రేటు 7.1గా ఉన్నట్లు తెలుసుకుంది.

  మొత్తానికి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేలోపు... రకరకాల మందులు తెరపైకి వచ్చేస్తున్నాయి. నెక్ట్ ఆరు నెలల్లో మరిన్ని మందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏమో... అసలు వ్యాక్సిన్‌తో పనిలేకుండా కూడా పోవచ్చేమో అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  First published: