12 లక్షలు దాటిన కరోనా కేసులు... మరణాలు 64 వేలకు పైనే

Corona Lockdown | Coronaupdate : నో డౌట్... కరోనా వైరస్ అత్యంత ఎక్కువగా పాకుతోంది. రోజువారీ లెక్కలు ఇదే నిర్ధారిస్తున్నాయి.

news18-telugu
Updated: April 5, 2020, 5:38 AM IST
12 లక్షలు దాటిన కరోనా కేసులు... మరణాలు 64 వేలకు పైనే
ప్రతీకాత్మకచిత్రం (credit - trackcorona.live/map)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : చైనాలో కంటే ఇటలీలో కరోనా ఎక్కువగా సోకింది. ఇప్పుడు ఇటలీలో కంటే... అమెరికాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 83657 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 1200319కి చేరింది. వీరిలో 246174 మంది కోలుకున్నారు. 889478 మంది మాత్రం వైరస్‌తో బాధపడుతున్నారు. ఐతే... వీరిలో 847154 మందికి కరోనా వైరస్ అంతంతమాత్రంగానే ఉంది. 42324 మందికి మాత్రం వైరస్ తీవ్రంగా ఉంది. మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 5 శాతంగా ఉంది. ప్రస్తుతం మరణాల సంఖ్య 64667గా ఉంది. మొత్తం కేసుల్లో మరణాలు 21 శాతంగా ఉన్నాయి.

అమెరికాలో ఒక్క రోజులో 33072 కేసులు రాగా... మొత్తం కేసుల సంఖ్య 310233గా ఉంది. ఒక్క రోజులో 1040 మంది చనిపోవడంతో... మృతుల సంఖ్య 8444గా నమోదైంది.

స్పెయిన్‌లో కొత్తగా 6969 కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 126168 అయ్యాయి. కొత్తగా 749 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 11947కి చేరింది.

ఇటలీలో శనివారం 4805 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 124632 అయ్యింది. శనివారం కొత్తగా 681 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 15362 అయ్యింది.

ఇక జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఇరాన్, బ్రిటన్, టర్కీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రియా, పోర్చుగల్, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, స్వీడన్, నార్వే, ఆస్ట్రేలియా, రష్యా, ఐర్లాండ్, చిలీ, డెన్మార్క్, పోలాండ్, రొమేనియా, మలేసియా, ఈక్వెడార్, జపాన్, ఫిలిప్పీన్స్‌, ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం వేగంగా అప్‌డేట్ చెయ్యట్లేదంటున్నారు చాలా మంది. తాజా లెక్కలు చూస్తే... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3072గా ఉంది. 213 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 75గా ఉంది. ఇక తెలంగాణలో అనధికారికంగా పాజిటివ్ కేసుల సంఖ్య 272గా ఉండగా... అధికారికంగా ఇది 159గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య అనధికారికంగా 192గా ఉండగా... అధికారికంగా ఇది 161గా ఉంది. తెలంగాణలో మృతుల సంఖ్య అధికారికంగా 7గా ఉండగా... ఏపీలో 1గా ఉంది.
First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading