కరోనా వైరస్ చైనా వుహాన్ ల్యాబ్‌లోనే తయారైంది : నోబెల్ గ్రహీత

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్‌ని మనుషులే తయారుచేశారనీ... అది ప్రకృతిలో పుట్టింది కాదనే వాదన క్రమంగా బలపడుతోంది.

news18-telugu
Updated: April 19, 2020, 10:26 AM IST
కరోనా వైరస్ చైనా వుహాన్ ల్యాబ్‌లోనే తయారైంది : నోబెల్ గ్రహీత
ల్యుక్ మొంటాగ్నియర్ (credit - twitter - Coronavirus Report)
  • Share this:
Corona Lockdown | Corona Update : చైనాలోని వుహాన్‌ నగరంలో... వైరస్‌లపై ప్రయోగాలు చేసే మూడు ల్యాబ్‌లు ఉన్నాయి. వాటిలో ఒక ల్యాబ్... వెట్ మార్కెట్ (వన్యప్రాణులు అమ్మే మార్కెట్) దగ్గర్లోనే ఉంటుంది. ఆ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ని స్వయంగా మనుషులే తయారుచేశారనే ఆరోపణలు... నాలుగు నెలలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఫాక్స్ న్యూస్ కూడా... ఈ వాదనను బలపరుస్తూ... చైనాకి వ్యతిరేకంగా వార్త ఇచ్చింది. ఆల్రెడీ అమెరికా... చైనాపై రెగ్యులర్‌గా ఈ ఆరోపణ చేస్తూనే ఉంది. తాజాగా... ఫ్రాన్స్ వైరాలజిస్ట్ (వైరస్‌పై పరిశోధన చేసే శాస్త్రవేత్త), మెడిసిన్‌లో నోబెల్ అవార్డ్ పొందిన ల్యుక్ మొంటాగ్నియర్ (Luc Montagnier)... కరోనా వైరస్ (SARS-CoV-2) అనేది మనుషులు సృష్టించిందేననీ,... చైనాలోని వుహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్‌కి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్నప్పుడు... జరిగిన ప్రమాదంలో... ఈ కొత్త వైరస్ పుట్టిందని ఆయన అన్నారు. ఈ ల్యాబ్... 2000 సంవత్సరం నుంచి ఇలాంటి వైరస్‌లపై పరిశోధనలు చేస్తోంది.

ఫ్రాన్స్‌కి చెందిన ఓ న్యూస్ ఛానెల్... ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే... మొంటాగ్నియర్ ఈ బాంబు పేల్చారు. ఆయన ఇలా ఎందుకు అన్నారో మనం తెలుసుకుందాం. ఈ మొంటాగ్నియర్, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి... ఎయిడ్స్ వైరస్‌ని గుర్తించారు. అందుకోసం వీళ్లు ముగ్గురికీ 2008లో మెడిసిన్‌లో నోబెల్ అవార్డ్ వచ్చింది. సో... ఈ మొంటాగ్నియర్‌కి ఎయిడ్స్ వైరస్ ఎలా ఉంటుందో... అందులో ఉండే జన్యువులు ఏంటో పూర్తిగా తెలుసు.

మొంటాగ్నియర్ ఏమన్నారంటే... కరోనా వైరస్ జన్యువుల్లో... ఎయిడ్స్ (హ్యూమన్ ఇమ్యునో వైరస్ - HIV) మూలకాలు, మలేరియా జెర్మ్ ఉన్నట్లు తెలిపారు. అందువల్లే ఈ వైరస్ సహజంగా పుట్టినట్లు తనకు అనిపించట్లేదని ఆయన అన్నారు.

మొంటాగ్నియర్ చెప్పిన విషయాల్ని బలపరిచే కొన్ని అంశాల్ని మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు.
- మొదటి నుంచి శాస్త్రవేత్తలు... ఈ కరోనా వైరస్ అనేది ఒకటి కాదనీ... రెండు రకాల వైరస్‌లు కలిసి ఇది తయారైందని అంటున్నారు. ఆ రెండు రకాల్లో ఒకటి సార్స్ వైరస్ అని చెబుతున్నారు. అంటే... సార్స్ వైరస్‌లో జన్యువులు, HIVలో జన్యువులు కలిపి ఈ వైరస్‌ని తయారు చేసి ఉండొచ్చనే వాదన చర్చనీయాంశమే.
- కరోనా వైరస్‌కి చాలా వరకు చెక్ పెడుతున్నది మలేరియాని తరిమేసే డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ అని మనకు తెలుసు. మొంటాగ్నియర్ తన మాటల్లో ఏం చెప్పారు... మలేరియా క్రిమి లక్షణాలు (మలేరియా జెర్మ్) కూడా కరోనా వైరస్‌‌కి ఉన్నాయని చెబుతున్నారు కదా.
- చైనా ఈ వైరస్‌కి చెక్ పెట్టేందుకు జనవరిలో... ఎయిడ్స్‌ని అరికట్టేందుకు వాడే మందులను వాడి చూసింది. కానీ అవి ఫలించలేదు. అవే ఎందుకు వాడింది? అన్న ప్రశ్నకు మొంటాగ్నియర్ చెప్పిన మాటల్లో సమాధానం దొరికే ఛాన్సుంది.అమెరికా ఆల్రెడీ ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తికి ఆదేశించింది. పదే పదే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్... దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపారు.

మొంటాగ్నియర్ చేసిన ఆరోపణలు... ప్రపంచవ్యాప్తంగా భగ్గుమనడంతో... ఫ్రాన్స్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆయన వ్యాఖ్యల్ని ఖండించింది. ఆ వ్యాఖ్యలకు ఆధారాలు లేవని తెలిపింది. కరోనా వైరస్ అనేవి ఒకే రకమైన జాతికి చెందిన రకరకాల వైరస్‌లనీ.. అందువల్ల వాటిలో దాదాపు ఒకేరకమైన లక్షణాలు ఉండటం సహజమేనని తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ల్యాబ్ నుంచి వైరస్ వ్యాపించింది అనేందుకు ఆధారాలు లేవని తెలిపింది. శాస్త్రీయంగా (సైంటిఫిక్) కూడా ఈ ఆరోపణ నిలబడలేదని తెలిపింది.
Published by: Krishna Kumar N
First published: April 19, 2020, 10:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading