రెవెన్యూ వేటలో కేంద్రం... త్వరలో 10 కొత్త పన్నుల బాదుడు?

రెవెన్యూ వేటలో కేంద్రం... త్వరలో 10 కొత్త పన్నుల బాదుడు? (File)

Corona Lockdown | Corona Update : ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికీ... దేశాన్ని ముందుకు నడపడానికీ డబ్బు కావాలంటున్న కేంద్రానికి ఐటీ అధికారులు చేసిన సూచనలు బాగా నచ్చినట్లు తెలిసింది.

 • Share this:
  Corona Lockdown | Corona Update : ఇన్‌కంటాక్స్ విభాగంలోని దాదాపు 50 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (IRS) అధికారులు... దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఎలా గాడిన పెట్టాలో సూచనలు చేసారు. ప్రధానంగా పన్ను ఆదాయం మున్ముందు కొన్నేళ్లపాటూ తగ్గడం ఖాయమంటున్న ఐటీ... పన్ను ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాల్ని వెతికింది. FORCE పేరుతో ఓ టీం... ఈ పనిలో నిమగ్నమై... ప్రజల నుంచి పన్నులు ఎలా రాబట్టాలి? రెగ్యులర్ మార్గాలతోపాటూ... కొత్త మార్గాలు ఏమున్నాయ్? కరోనా వల్ల లాభపడే కంపెనీలు ఏవి ఉన్నాయి? వాటి నుంచి పన్ను లాగడం ఎలా వంటి అంశాల్ని బాగా పరిశీలించాయి. ప్రతిపాదనల్లో కొన్ని ఏడాది లోపు పన్ను వసూళ్లకు చెందినవి కాగా... కొన్ని 6 నెలల్లోపే పన్ను రాబట్టుకునేవి ఉన్నాయి. అవేంటో ఫటాఫట్ తెలుసుకుందాం.

  Taxing the wealthy : సంపన్నులపై వీరబాదుడు. 2020-21లో సర్ ఛార్జ్ కింద రూ.2700 కోట్లు మాత్రమే వస్తోందనీ... పన్ను స్లాబ్‌ను గరిష్టంగా 40 శాతం పెంచాలని ప్రతిపాదించారు.

  Tax India income of foreign companies : విదేశీ కంపెనీలు ఇండియాలో సంపాదించే సొమ్ముపై సర్ ఛార్జీని పెంచమని ప్రతిపాదించారు. ఇప్పుడైతే 2 శాతం వేస్తున్నారు. అందువల్ల రూ.కోటి నుంచి రూ.10కోట్లు వస్తోంది. సర్‌ ఛర్జీని 5 శాతం చేస్తే... రూ.10 కోట్లకు మించి వస్తుందని చెప్పారు.

  COVID relief cess : పన్ను చెల్లించే ప్రతి ఒక్కరిపై కొవిడ్ రిలీఫ్ సెస్ వెయ్యాలన్నారు. ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ సెస్ 2 శాతం ఉంది. అదనంగా వన్ టైమ్ కింద 4 శాతం కొవిడ్ రిలీఫ్ సెస్ వెయ్యమని సూచించారు. తద్వారా రూ.15 నుంచి రూ.18వేల కోట్లు వస్తాయని అంచనా. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారిపై దీన్ని వెయ్యమన్నారు.

  Mobilisation of CSR funds for COVID relief : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS) డబ్బును... కొవిడ్ కోసం వాడమని సూచించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇలాగే చెయ్యమని చెప్పారు.

  New tax saving scheme : ఇలాంటి టాక్స్ సేవింగ్ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బును... కరోనా వైరస్ రిలీఫ్ కోసం వాడాలని సూచించారు. ఇలాంటి డబ్బును ఐదేళ్లపాటూ సేవింగ్ చేసుకోవడం ద్వారా... ఎక్కువ వడ్డీ వచ్చేలా చేయాలన్నది ప్లాన్.

  New amnesty scheme for collection of undisputed demands : వివాద్ సే విశ్వాస్ స్కీమ్ లాంటిదే మరొకటి తేవాలని అంటున్నారు. తద్వారా పెనాల్టీల ద్వారా మనీ రాబట్టుకోమంటున్నారు.

  ఇక చిన్న చిన్న టాక్స్ ప్రతిపాదనలను చూస్తే....

  Reintroduction of the Inheritance Tax : ఇన్హెరిటాన్స్ టాక్స్ అనేది దాదాపు 55 శాతం దాకా ఉంటుంది. 1985 వరకు ఇది అమల్లో ఉంది. ఇప్పుడు దాన్ని మళ్లీ తేవాలంటున్నారు.

  Raise capital gains to 10% on overseas Indian citizens : విదేశాల్లోని భారతీయులపై కేపిటల్ గెయిన్స్ ను 10 శాతానికి సెట్ చెయ్యమంటున్నారు. ప్రస్తుతం అది 30 శాతంగా ఉంది.

  Rationalisation of equalisation levy : ఈక్వలైజేషన్ లెవీ లేదా గూగుల్ టాక్స్. 2016 ఫైనాన్స్ యాక్ట్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. నాన్-రెసిడెంట్ వ్యాపారాలపై ఇలాంటి టాక్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. అడ్వర్టైజ్‌మెంట్ స్పేస్ అండ్ సర్వీసెస్ లాంటి సంస్థలపై ఈ టాక్స్ అమలవుతోంది.

  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జూమ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల వాడకం పెరుగుతుంది కాబట్టి... ఇలాంటి డిజిటల్ వేలో కూడా పన్నులు వేసే అంశాన్ని పరిశీలించమని కేంద్రానికి సూచించారు.

  Give It Up campaign : సంపన్నులు సబ్సిడీ గ్యాస్ బండను వదులుకోవాలని కోరినట్లుగా.... కొన్ని రకాల టాక్స్ డిడక్షన్స్‌ని కూడా రద్దు చేసుకోమని కేంద్రం కోరే అవకాశాలున్నాయి. అంటే 80C కింద వచ్చే మినహాయింపులను రద్దు చేసుకోవాలని కోరవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: