ఇండియాలో కరోనా ముగింపుపై గుడ్ న్యూస్ చెప్పిన సింగపూర్ పరిశోధకులు

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ ఇండియాని ఎప్పటికల్లా వదిలేస్తుంది అన్న అంశంపై సింగపూర్ పరిశోధకులు తమదైన పరిశోధన చేసి... అభిప్రాయం చెప్పారు.

news18-telugu
Updated: April 26, 2020, 12:06 PM IST
ఇండియాలో కరోనా ముగింపుపై గుడ్ న్యూస్ చెప్పిన సింగపూర్ పరిశోధకులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా కేసులు, వ్యాప్తి, నమోదవుతున్న కేసులు, లాక్‌డౌన్, ఇండియాలో పరిస్థితులు, మెడికల్ సౌకర్యాలు ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (SUTD) పరిశోధకులు... ఇండియాలో కరోనా వైరస్... మే 21 నాటికి పూర్తిగా తొలగిపోతుందని అంచనా వేశారు. ఇదే సమయానికి చాలా దేశాల్లో కరోనా వైరస్ వెళ్లిపోతుందని కూడా అన్నారు. ఇందుకోసం ఈ పరిశోధకులు SIR (సస్సెప్టిబుల్ ఇన్ఫెక్టెడ్ రికవర్డ్ - అనుమానం - వ్యాప్తి - రికవరీ) మోడల్‌ను లెక్కలోకి తీసుకున్నారు. ఇండియాతోపాటూ... చాలా దేశాల డేటాను ఇలాగే పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎలా వ్యాపిస్తోందో లెక్కలేశారు.

గణాంకాల లెక్కల ఆధారంగా వచ్చిన ఈ అంచనా ద్వారా... మే 21 నాటికి ఇండియాలో కరోనా వైరస్ 97 శాతం వదిలిపోతుంది. ఇండియాలో కరోనా వైరస్ ఏ విధంగా ప్రబలుతోందో SUTD ఎక్కువగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రోజువారీ డేటాను పరిశీలించింది. ఐతే... ఈ పరిశోధనా సారాంశాన్ని అధ్యయనం కోసమే ఉపయోగిస్తున్నారు తప్ప... ఇతర అంశాల కోసం ఇవ్వట్లేదు.

లాక్‌డౌన్‌ను మే 16 వరకూ కొనసాగిస్తే... కొత్త కేసుల నమోదు ఉండకపోవచ్చనే అభిప్రాయం ఇండియాలో వ్యక్తమవుతోంది. ఐతే... ప్రస్తుతం ఇండియాలో మొత్తం యాక్టివ్ కేసులు 20 వేల దాకా ఉన్నాయి. వీళ్లందరికీ... వచ్చే రెండు మూడు వారాల్లో కరోనా నయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే... దేశంలో కొత్త కేసుల నమోదు ప్రస్తుతం ఎక్కువగానే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1990 కేసులు నమోదవ్వగా... 49 మంది చనిపోయారు. ఇప్పటివరకూ ఇండియాలో ఇదే అతి ఎక్కువ నమోదు. కొత్త కేసుల్ని తగ్గిస్తూ... ఉన్న కేసుల్ని రికవరీ చేస్తూ పోవాల్సిన సవాల్ ముందుంది.

SUTD లెక్కల ప్రకారం... మే 29 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్... 97 శాతం కనుమరుగవుతుంది. అలాగే... డిసెంబర్ 8 నాటికి పూర్తిగా మాయమవుతుంది. అలాగే అమెరికాలో మే 11 నాటికి 97 శాతం కరోనా పోతుంది. స్పెయిన్‌లో మే 9 నాటికి, ఇటలీలో మే 7 నాటికి 97 శాతం నయమవుతుంది. ఇరాన్‌లో మే 10 నాటికి, టర్కీలో మే 15 నాటికి కరోనా చాపచుట్టేస్తుంది. ఇక ఫ్రాన్స్‌లో మే 3, జర్మనీలో ఏప్రిల్ 30, కెనడాలో మే 16 నాటికి కరోనా 97 శాతం పోతుంది.

ఐతే.... జర్మనీలో ప్రస్తుతం 40వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అలాగే రోజూ 1500 దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజూ 2000లోపు కేసులు నమోదవుతున్న ఇండియాకి మే 21 వరకూ కరోనా పోనప్పుడు.... రోజూ 1500 కేసులతో ఉన్న జర్మనీలో.. మరో నాల్రోజుల్లో కరోనా 97 శాతం ఎలా వదిలిపోతుందన్నది తేలాల్సిన ప్రశ్న. ఇది వాస్తవానికి దగ్గరగా లేనట్లే అనుకోవచ్చు. కొన్ని సైంటిఫిక్ లెక్కలు, గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేసినా... దీన్ని ఎంతవరకూ నమ్మాలన్నది సందేహమే.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading