ఏపీలో ఆగని కరోనా... ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు...

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.

news18-telugu
Updated: April 5, 2020, 6:47 AM IST
ఏపీలో ఆగని కరోనా... ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు...
ఏపీలో ఆగని కరోనా... ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు...
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నాడు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది. ముఖ్యంగా నెల్లూరులో ఏకంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఎక్కువగానే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నెల్లూరులో మరిన్ని కేసులు పెరగకుండా జిల్లా కలెక్టర్... లాక్‌డౌన్ పటిష్టంగా అమలయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్ని రిస్క్ జోన్లుగా ప్రకటించి... అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే నిత్యవసర సరుకులు కొనే సమయాన్ని కూడా తగ్గించారు.

ఇక కృష్ణా జిల్లాలో పెరుగుతున్న కేసులకు కారణం... ఢిల్లీ ప్రార్థనలే అని తెలిసింది. ప్రభుత్వం జిల్లాలోని కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా శానిటైజ్ చేస్తోంది. ఐతే... ఇప్పుడు జిల్లాలో చాలా మంది అనుమానిత కేసులున్నాయి. వాటి రిపోర్టులు వస్తే... జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులున్నది క్లియర్‌గా తెలియదు. విజయవాడలో రెండు ఆస్పత్రుల్ని పూర్తిగా కొవిడ్-19 ఆస్పత్రులుగా మార్చి... అనుమానితులు, పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. అలాగే కడపలో... 23కి చేరింది. విశాఖలో కరోనా కేసులు పెరగడంతో... జోన్ 4ను రెడ్ జోన్‌గా మార్చారు. ఇక్కడ కూడా ఢిల్లీ లింకులు బయటపడ్డాయి. అటు కర్నూలు జిల్లా నుంచి 449 మంది ఢిల్లీ జమాత్‌కి వెళ్లారు. వాళ్ల శాంపిల్స్ పంపించగా... 350 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని... ఏలూరులో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారితో రోడ్లు ఊడ్పించారు.

ప్రకాశం జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతూ 21కి చేరాయి. ఐతే... లండన్ నుంచి వచ్చి కరోనా పాజిటివ్ అయిన యువకుడు ఇప్పుడు నెగెటివ్ అయ్యాడు. అతన్ని డిశ్ఛార్జి చేశారు.కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం... వైద్యశాఖ, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి పూర్తి జీతం చెల్లించాలని ఆదేశించింది. ఐతే... అఖిలభారత సర్వీస్ అధికారులకు 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం జీతాల్ని వాయిదా వేస్తోంది.

అటు కేంద్రం... ఏపీకి భారీగా మెడికల్ కిట్లను పంపింది. అవి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. అక్కడి నుంచి స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లాయి. ఇలా ఏపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading