హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లను ఎత్తేస్తున్న పోలీసులు..

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లను ఫ్రీ చేసేస్తున్నారు.

news18-telugu
Updated: April 29, 2020, 11:52 AM IST
హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లను ఎత్తేస్తున్న పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా దెబ్బకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మర్కజ్ ఘటనతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంది. అయితే, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కంటైన్మెంట్ జోన్లను ఫ్రీ చేసేస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌ను దాటడం లేదు. దీంతో చార్మినార్‌ జోన్‌ పరిధిలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌నామా, రాజేంద్ర నగర్‌లోని క్వారంటైన్ సెంట‌ర్లను తొలగించారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్‌లో గతంలో 35 పాజిటివ్‌ కేసులు ఉండగా, 10 కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 3 కేంద్రాలను తాజాగా తొలగించారు. చార్మినార్‌ సర్కిల్‌లో 16 పాజిటివ్‌ కేసులు ఉండగా 9 కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక దాన్ని తొలగించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 9 పాజిటివ్‌ కేసులు ఉండగా 7 కేంద్రాలు ఉండేవి. వాటిలో ఐదింటిని తొలగించారు.

అటు.. సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తాలో పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. మెట్టుగూడ, ఆలుగడ్డబావి నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ ఏరియాలో కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉండటం, ఆ పక్కనే గాంధీ ఆస్పత్రి ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 29, 2020, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading