పెట్టుబడుల విషయంలో భారత్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది : చైనా

Corona Lockdown | Corona Update : భారత ప్రభుత్వం తన విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించడంతో... అది తమకు ఇబ్బందికరం అని భావిస్తున్న చైనా... తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: April 20, 2020, 1:56 PM IST
పెట్టుబడుల విషయంలో భారత్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది : చైనా
పెట్టుబడుల విషయంలో భారత్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది : చైనా (credit - twitter - Joe Scarborough)
  • Share this:
Corona Lockdown | Corona Update : భారత్‌లోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం (DPIIT)... తన విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించడాన్ని చైనా తట్టుకోలేకపోతోంది. ఎందుకంటే... కేంద్రం నిర్ణయం వల్ల భారత్‌తో సరిహద్దులు కలిగివున్న దేశాల్లోని కంపెనీలకు ఈ మార్పుల పాలసీ క్లిష్టతరంగా ఉంటుంది. ఈ దేశాల జాబితాలో చైనా కూడా ఉంది. ఇకపై ఈ దేశాల్లో కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ఒకింత కష్టమే. డిసెంబర్ 2019 నాటికి భారత్‌లో చైనా పెట్టుబడులు... 8 బిలియన్ డాలర్లు దాటాయి. ఇవి ఎంత ఎక్కువంటే... భారత్‌తో సరిహద్దు కలిగిన ఇతర దేశాలన్నీ కలిపి పెట్టిన పెట్టుబడుల కంటే ఎక్కువ. అందువల్ల భారత కొత్త పాలసీ... చైనా పెట్టుబడిదారులపై కచ్చితంగా ప్రభావం చూపించనుంది. ఇండియాలో మొబైల్ ఫోన్, ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ పరికరాలు, మౌలిక వసతులు, ఆటో మొబైల్ వంటి రంగాల్లో చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. తద్వారా... భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పుట్టుకొచ్చాయనీ... అది రెండు దేశాలకూ కలిసొచ్చిందని చైనా తెలిపింది. ఇప్పుడు భారత్ చేస్తున్న కరోనాపై పోరాటానికి... చైనాకి చెందిన కంపెనీలు కూడా విరాళాలు ఇస్తున్నాయని చెప్పుకొచ్చింది.

విదేశీ కంపెనీలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది భారత దేశ ఆర్థిక అవసరాలు, ప్రాధాన్యాలు, వ్యాపార పరిస్థితులను బట్టీ నిర్ణయం ఉంటుందన్న చైనా... కొవిడ్-19 వల్ల ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్నాయనీ... ఇలాంటి సమయంలో... దేశాలు కలిసి సహకరించుకుంటూ... సరైన పెట్టుబడి అవకాశాలు సృష్టిస్తూ... తిరిగి వ్యాపార, వాణిజ్యాలు పట్టాలెక్కేలా చెయ్యాల్సి ఉంటుందని భారత్ తీరును తప్పుపట్టింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WTO) సిద్ధాంతాల ప్రకారం... ఏ దేశం నుంచి పెట్టుబడులు వచ్చినా... వివక్ష చూపించకూడదనీ... పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఇవ్వాలని చైనా కోరింది. జీ20 దేశాల నేతలు, వాణిజ్య మంత్రులు... స్వేచ్ఛాయుత, పారదర్శక, వివక్షారహిత వాణిజ్యం కోరుతూ... తమ మార్కెట్లను తెరచి ఉంచుతున్నారని చైనా వివరించింది. మార్కెట్ సిద్ధాంతాల్ని బట్టీ... ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో కంపెనీలు నిర్ణయించుకుంటాయన్న డ్రాగన్ కంట్రీ... ఇండియా తన వివక్షాపూరిత విధానాల్ని మార్చుకుంటుందని భావిస్తున్నాంటూ... ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని దేశాల పెట్టుబడుల్నీ భారత్ సమాన దృష్టితో చూస్తుందని అనుకుంటున్నామన్న చైనా.... చక్కటి వాణిజ్య వాతావరణం కల్పిస్తుందని కోరుకుంటున్నట్లు తెలిపింది.
Published by: Krishna Kumar N
First published: April 20, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading