కూతురి స్కూల్ ఫీజు కట్టాలి... కిడ్నీలు అమ్ముకోనివ్వండి... ప్రధానికి ఓ తండ్రి వినతి...

Corona Lockdown | Corona Update : ఇలాంటి హృదయ విదారక పరిస్థితి ఆ తండ్రికి ఎందుకొచ్చింది. స్కూల్ ఫీజు అంత భారం ఎందుకైంది? తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 26, 2020, 12:27 PM IST
కూతురి స్కూల్ ఫీజు కట్టాలి... కిడ్నీలు అమ్ముకోనివ్వండి... ప్రధానికి ఓ తండ్రి వినతి...
కూతురి స్కూల్ ఫీజు కట్టాలి... కిడ్నీలు అమ్ముకోనివ్వండి... ప్రధానికి ఓ తండ్రి వినతి... (File)
  • Share this:
"నా కిడ్నీలు అమ్ముకునేందుకు నాకు చట్టబద్ధంగా అనుమతి ఇవ్వండి. ఆ డబ్బుతో నా కూతురి స్కూల్ ఫీజు చెల్లిస్తాను" అని ప్రధానిని రిక్వెస్ట్ చేస్తూ లేఖ రాశాడు ఓ తండ్రి. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అతుల్ వోహ్రా లాక్‌డౌన్ సందర్భంగా... తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాడు. నిండా అప్పులున్నాయి. అతను... మే 31లోగా ఫీజ్ చెల్లించాలని స్కూల్ యాజమాన్యం కండీషన్ పెట్టింది. తన దగ్గర ఏమీ లేవన్న అతను... కిడ్నీలు అమ్ముకోవడమే తనకు మిగిలిన ఆప్షన్ అని తెలిపాడు. అది చట్ట విరుద్దం కాబట్టి... కేంద్రం చట్టంలో మార్పులు చేసి... అనుమతి ఇస్తే... వెంటనే అమ్ముకుంటానని తెలిపాడు.

అతుల్ వోహ్రా కూతురు ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ప్రస్తుత 2019-20 విద్యాసంవత్సరానికి పెరిగిన ఫీజులతో కలిపి మొత్తం రూ.32వేలు చెల్లించాలని స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. ఇటీవలి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం... స్కూళ్లు... ఏప్రిల్, మే నెలలకు సంబంధించి... పేరెంట్స్ నుంచి ట్యూషన్ ఫీజు మాత్రమే మే 31లోపు వసూలు చేసుకునే వీలుంది.

తాను ఫీజు చెల్లించలేకపోతే... లేట్ ఛార్జీలు కూడా బాదేస్తారనీ, అవన్నీ భరించడం తన వల్ల కాదని వోహ్రా లేఖలో తెలిపాడు. తన కుటుంబం తన సంపాదనపైనే ఆధారపడి ఉందన్న అతను... ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నాననీ... ఇప్పుడా ఉద్యోగం లేదనీ చెప్పాడు. ఇన్నాళ్లూ కూడబెట్టిన కాస్త డబ్బుతో... ఐదుగురం కలిసి బతుకుతున్నామనీ... తన తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులే తమకు దిక్కయ్యాయని వివరించాడు.

ఇప్పటికే ఇంటి అద్దెలు, EMIలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, వైద్య ఖర్చులు, ఇతరత్రా అవసరాలకోసం స్నేహితుల దగ్గర అప్పులు చేశానన్న వోహ్రా... తాను వాటిని తీర్చే పరిస్థితుల్లో లేనన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే... అవయవాలు అమ్ముకునేందుకు చట్టంలో మార్పులైనా చెయ్యాలనీ, తనలాంటి తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకొని ఫీజులు చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు వోహ్రా. మరి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.
Published by: Krishna Kumar N
First published: May 26, 2020, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading