హ్యాండ్ శానిటైజర్ వాడితే కాన్సర్ వస్తుందా? వివరణ ఇచ్చిన కేంద్రం

Corona Lockdown | Corona Update : హ్యాండ్ శానిటైజర్ వాడితే కాన్సర్ వస్తుందని ఆ న్యూస్ పేపర్ చెప్పడంతో... కేంద్రం ఈ అంశంపై స్పందించింది.

news18-telugu
Updated: June 3, 2020, 8:44 AM IST
హ్యాండ్ శానిటైజర్ వాడితే కాన్సర్ వస్తుందా? వివరణ ఇచ్చిన కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ వచ్చిన తర్వాత... కరోనా లక్షణాలు, మాస్కులు, శానిటైజర్లు, వ్యాక్సిన్లపై రోజూ వందల కొద్దీ వార్తలు వస్తున్నాయి. వీటిలో కొన్ని నిజాలు ఉంటుంటే... కొన్ని అబద్ధాలు ఉంటున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడానికి నెటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. ఈమధ్య ఓ న్యూస్ పేపర్ వింత వార్త ఇచ్చింది. ఏం చెప్పిందంటే... కంటిన్యూగా 50 నుంచి 60 రోజులు హ్యాండ్ శానిటైజర్ వాడితే... ప్రమాదకర చర్మ వ్యాధులు వస్తాయనీ, కాన్సర్ వస్తుందనీ చెప్పింది. ఇది కాస్తా నెట్‌లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వార్తను తమ స్నేహితులకు, ఇతరులకూ షేర్ చేసుకున్నారు.

ఈ వార్త అటు తిరిగీ, ఇటు తిరిగీ... చివరకు కేంద్ర ఆరోగ్య శాఖకు చేరింది. ఇది చదివిన కేంద్ర ఆరోగ్య శాఖ... అవునా... నిజమా... అలా మనకు ఎవ్వరూ చెప్పలేదే... అనుకుంటూ... ఎక్స్‌పర్ట్స్‌ని పిలిచి... ఇందులో నిజం ఎంత అని అడిగింది. ఇందులో 1 శాతం కూడా నిజం లేదని ఆ ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. హ్యాండ్ శానిటైజర్ అనేది మనుషులకు హాని చెయ్యదనీ... అందులో ఆల్కహాల్ శాతం కనీసం 70 కంటే ఎక్కువ ఉండేలా చేసుకుంటే... అది క్రిములతో చక్కగా పోరాడగలదని చెప్పారు. కరోనా వైరస్‌తో పోరాటేందుకు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు వాడాలని సూచించారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ... ఈ వార్తలో నిజం లేదనీ, ఇది ఫేక్ న్యూస్ అని ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు చెప్పింది.


కాబట్టి మనం సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలూ నిజమే అని నమ్మేయవద్దు. ముఖ్యంగా "ఇది చదివితే షాక్ అవుతారు, ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు" అంటూ అతి కలిగించేలా హెడ్డింగ్స్ పెట్టే వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి. ఇలాంటి వార్తల్లో నిజాల కంటే ఫేకే ఎక్కువని తెలిపాయి.
First published: June 3, 2020, 8:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading