దేశంలో ప్రైవేట్ హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఇవీ కొత్త గైడ్‌లైన్స్...

Corona Lockdown | Corona Update : లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త గైడ్‌లైన్స్ ఏంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 26, 2020, 10:22 AM IST
దేశంలో ప్రైవేట్ హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఇవీ కొత్త గైడ్‌లైన్స్...
దేశంలో ప్రైవేట్ హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఇవీ కొత్త గైడ్‌లైన్స్... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : మే 25న దేశీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... ఒక రోజు గడవగానే... దేశంలో ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీసులు, చార్టర్డ్ ఎయిర్‌లైన్, ప్రైవేట్ ఎయిర్‌లైన్ హెలికాప్టర్ సర్వీసులకు కూడా అనుమతి ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు రాజకీయ నేతలు, సెలబ్రిటీల వంటి వారు... హెలికాప్టర్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే... ఎవర్నైనా అర్జెంటుగా తీసుకెళ్లాల్సి వస్తే... ఎయిర్ అంబులెన్స్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వ కార్యక్రమాల కోసం... వేగంగా ప్రయాణించేందుకు ఇప్పుడు వీలు కానుంది. ఐతే... కేంద్రం కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం.

ప్రైవేట్ ఎయిర్ సేవలకు కేంద్రం గైడ్‌లైన్స్ :

- ప్రైవేట్ హెలికాప్టర్లు, చార్టర్డ్ ఎయిర్‌లైన్, ప్రైవేట్ ఎయిర్‌లైన్ హెలికాప్టర్లలో... ముసలివారు, గర్భిణీ మహిళలు ప్రయాణించకూడదు. (ఈ విషయంలో ఎయిర్ అంబులెన్స్‌కి మినహాయింపు ఉంది)
- ఎయిర్‌పోర్ట్ లేదా... హెలిప్యాడ్ దగ్గరకు 45 నిమిషాల ముందే చేరుకోవాలి.
- వెబ్ చెక్ ఇన్, ఎలక్ట్రానిక్ పేమెంట్ తప్పనిసరి.
- థెర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేస్తారు.
- ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.- డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్ధారించిన ప్రైస్ క్యాప్... వర్తించదు.
- అద్దె ఎంత అన్నది రెండువైపులా మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోవాలి.
- ఆహారం వెంట తెచ్చుకోవాలి.
- ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. అది లేకపోతే... స్వయంగా డిక్లరేషన్ పత్రం ఇవ్వాలి.
- ప్రయాణం తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ అయినా లేక హెలికాప్టర్ అయినా తప్పనిసరిగా శానిటైజ్ చెయ్యాలి.

పై రూల్స్ పాటిస్తూ... ప్రైవేట్ ఎయిర్ సర్వీసులు ఇవాళ్టి నుంచి ప్రారంభించుకోవచ్చని కేంద్రం తెలిపింది.
First published: May 26, 2020, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading