కరోనాకి 6 కొత్త లక్షణాలు... CDC చెప్పిన సంకేతాలు...

Corona Lockdown | Corona Update : కరోనా వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయో... మనకు తెలుసు. మరికొన్ని కొత్త లక్షణాలు ఈ లిస్టులో చేరాయి.

news18-telugu
Updated: April 26, 2020, 10:27 AM IST
కరోనాకి 6 కొత్త లక్షణాలు... CDC చెప్పిన సంకేతాలు...
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : మీరు గమనించే ఉంటారు... చలివేసినప్పుడు, రోమాలు నిక్కబొడిచినప్పుడు... శరీరంపై వెంట్రుకల దగ్గర చిన్న చిన్న బుడిపెల (Chills) లాంటివి ఏర్పడతాయి. అవి ఐదారు సెకండ్లలోనే మాయమవుతాయి. అలా మాయం అవ్వకుండా... అవి తరచుగా వస్తూనే ఉంటే... ఆ వ్యక్తికి కరోనా సోకినట్లే అంటోంది అమెరికాలోని "ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" (CDC). ఈ సంస్థ ఏది చెప్పినా... వంద శాతం రీసెర్చ్ చేసిన తర్వాతే చెబుతుంది. ఇప్పటివరకూ ఈ సంస్థ కరోనాకి జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం మాత్రకే లక్షణాలుగా చెప్పింది. తాజాగా... ఎన్నో పరిశోధనలు జరిపి... కరోనా వచ్చే ముందు... 6 కొత్త లక్షణాల్ని (Symptoms)ని చెప్పింది. అవి ఏంటంటే...

CDC కరోనా కొత్త లక్షణాలు :

చిల్స్ (Chills)... గూస్‌బంప్స్ రావడం.
చిల్స్‌తో కూడిన వణుకు మళ్లీ మళ్లీ రావడం.
కండరాల నొప్పి
తలనొప్పి
గొంతులో గరగరరుచి, వాసన తెలియకపోవడం

CDC కరోనా పాత లక్షణాలు :
జ్వరం
దగ్గు
ఊపిరి ఆడకపోవడం

ఇప్పుడు ఈ 6 కలిపి... మొత్తం 9 లక్షణాలయ్యాయి. వీటిలో ఎవరికైనా ఏ ఒక్క లక్షణం కనిపించినా... వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇంట్లోనే ఉంటూ... మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ... ఇంట్లో వాళ్లను కూడా దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడాలి.

సపోజ్ తలనొప్పి వస్తే... అది కరోనాయే అనుకొని కంగారు పడాల్సిన పనిలేదు. వెయిట్ చెయ్యాలి. రెండు మూడు రోజులు ఆగాలి. నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా... తలనొప్పి, జ్వరం, దగ్గు వంటి వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. మూడు రోజులైనా అవి తగ్గకపోతే... అప్పుడు డాక్టర్‌కి కాల్ చేసి చెప్పడం మంచిదే.

ఓ అంచనా ప్రకారం... చాలా మందిలో కరోనా వైరస్ ప్రవేశించి... రెండు మూడు రోజుల్లోనే అది చచ్చిపోతోంది. అందువల్ల అలాంటి కేసులు రిజిస్టర్ కావట్లేదు. ఆ రెండు మూడు రోజులు మాత్రం... కొంత అసౌకర్యంగా, నీరసంగా, ఇబ్బందిగా అనిపించడం సహజం. మనకు జ్వరం వస్తే కూడా... నలతగా ఉంటుంది. కరోనా వస్తే కూడా అంతే. కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా... పొరపాటున వైరస్ లోపలికి వెళ్లినా... దాన్ని పెరగనివ్వకుండా... పూర్తిగా చంపెయ్యొచ్చు. అందుకోసం పై లక్షణాలు కనిపిస్తే... తగిన జాగ్రత్తలు పాటించెయ్యడమే.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading