హ్యాండ్ శానిటైజర్‌ను ముక్కు, నోటి చుట్టూ రాసుకోవచ్చా?

Corona Lockdown | Coronaupdate : కరోనాపై ప్రజలకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. వాటన్నింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానాలు ఇస్తోంది.

news18-telugu
Updated: April 8, 2020, 11:19 AM IST
హ్యాండ్ శానిటైజర్‌ను ముక్కు, నోటి చుట్టూ రాసుకోవచ్చా?
హ్యాండ్ శానిటైజర్‌ను ముక్కు, నోటి చుట్టూ రాసుకోవచ్చా? (credit - twitter - Manjit Minhas )
  • Share this:
Corona Lockdown | Coronaupdate : సబ్బుతో చేతులు కడుక్కుంటే... చేతులపై ఉండే కరోనా వైరస్ తొలగిపోతుందనీ, చచ్చిపోతుందనీ మనకు తెలుసు. అదే సబ్బుతో మనం స్నానం చేసేటప్పుడు... ఆ సబ్బును మనం ముక్కు, నోటి చుట్టూ కూడా రాసుకుంటాం. తర్వాత నీటితో కడిగేసుకుంటాం. ఇదే విధంగా హ్యాండ్ శానిటైజర్‌ను చేతులకు రాసుకుంటే... చేతులపై ఉండే కరోనా వైరస్ చచ్చిపోతుంది. అలాంటప్పుడు అదే శానిటైజర్ లేదా క్లోరిన్ ద్రవాన్ని... ముక్కు, నోటి చుట్టూ రాసుకుంటే తప్పేంటి? అప్పుడు ఈ మాస్కులు వాడే అవసరమే ఉండదుగా. ఇంత సింపుల్ టెక్నిక్ చెప్పరెందుకని... అని ఎవరో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను ప్రశ్నించారు. షాకైన WHO వెంటనే కాకపోయినా... వీలు చూసుకొని ఆన్సర్ ఇచ్చింది.

హ్యాండ్ శానిటైజర్‌ను ముక్కు, నోటి చుట్టూ రాసుకోవచ్చా?


ఏం చెప్పిందంటే... హ్యాండ్ శానిటైజర్, ఆల్కహాల్, క్లోరిన్ వంటి వాటిని శరీరంపై చల్లుకుంటే... అవి శరీరం లోపల ఉన్న కరోనా వైరస్‌ని చంపలేవని తెలిపింది. అలాగే... అలాంటి వాటిని చల్లుకుంటే... బట్టులు, కళ్లు, ముక్కు, నోటికి ప్రమాదం అని తెలిపింది. ఈ ఆల్కహాల్, క్లోరిన్ అనేవి... ప్రదేశాలపై ఉండే కరోనా వైరస్‌ని తరిమేసేందుకే వాడుతారన్న విషయం గుర్తుంచుకోమంది. అలాగే... కెమిస్టుల సూచనల మేరకే వాటిని వాడాలని చెప్పింది. కాబట్టి... మనం ఇలాంటి విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యకపోవడమే మేలు.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading