భారత్‌కు రూ.7536 కోట్ల రుణం ఇచ్చిన బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్...

Corona Lockdown | Corona Update : కరోనాపై పోరాడుతున్న భారత దేశానికి బ్రిక్స్ దేశాల అభివృద్ది బ్యాంక్ ఎమర్జెన్సీ రుణ సాయం అందించింది.

news18-telugu
Updated: May 13, 2020, 12:42 PM IST
భారత్‌కు రూ.7536 కోట్ల రుణం ఇచ్చిన బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్...
భారత్‌కు రూ.7536 కోట్ల రుణం ఇచ్చిన బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్... (credit - twitter - agentofzen)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా... అన్ని దేశాల ఖజానాల్లో డబ్బులు అయిపోతున్నాయి. భారత్‌లో 50 రోజులుగా లాక్‌డౌన్ ఉండటంతో... ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌తో పోరాడేందుకు బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంక్... భారత్‌కు 1 బిలియన్ డాలర్ (రూ.7536 కోట్లు) ఎమర్జెన్సీ రుణ సాయం చేసింది. ఈ డబ్బుతో... ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కమనీ, వచ్చిన నష్టాల్ని కొంతవరకైనా పూడ్చుకోమని తెలిపింది. చైనాలోని షాంఘై నగరంలో ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) ఉంది. దీన్ని 2014లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి ఏర్పాటుచేశాయి. దీని అధ్యక్షుడిగా ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ ఉన్నారు.

మౌలిక సదుపాయులు, అభివృద్ధి ప్రాజెక్టులకు దేశాల మధ్య నిధుల సాయం చేసుకునేందుకు బ్రిక్ దేశాలు ఈ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాయి. ఇతర దేశాలకు కూడా బ్రిక్స్ నుంచి రుణ సాయం అందుతోంది. ప్రస్తుతం కరోనా కాలంలో... చాలా దేశాలు రుణ సాయంపై ఆధారపడుతున్నాయి.

ఏప్రిల్ 30న భారత్‌కు రుణం ఇచ్చేందుకు NDB బోర్డు డైరెక్టర్లు ఒప్పుకున్నారు. సభ్య దేశాలకు రుణ సాయం అందించే విషయంలో తాము నిబద్ధతతో ఉన్నామని డైరెక్టర్ల బోర్డు తెలిపింది. NDB ఇచ్చిన నిధులను కేంద్ర ప్రభుత్వం... కరోనా వైరస్ నియంత్రణకు వాడనుంది. అలాగే వైద్య రంగ అభివృద్ధికి వాటిని కేటాయించనుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... మంగళవారం రాత్రి తన ప్రసంగంలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దానితో పోల్చితే బ్రిక్స్ బ్యాంక్ చేసిన రుణ సాయం చాలా చిన్నదే. కానీ... ఇలాంటి విపత్కర సమయంలో... ఇలాంటి రుణాలు దేశాన్ని గట్టెక్కించడానికి ఎంతో కొంత ఉపయోగపడతాయని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading