ఇది విన్నారా... బట్టతల వారికి కరోనా రిస్క్ ఎక్కువట...

Corona Lockdown | Corona Update : ప్రపంచ దేశాలు ఇదివరకు వేర్వేరు సమస్యలపై పరిశోధనలు చేసేవి. ఇప్పుడో... అందరూ కరోనాపైనే చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు. ఇప్పుడేం చెప్పారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 7, 2020, 9:19 AM IST
ఇది విన్నారా... బట్టతల వారికి కరోనా రిస్క్ ఎక్కువట...
ఉదయాన్నే బట్టతల వారికి ఓ బ్యాడ్ న్యూస్... మీకు ఆ రిస్క్ ఎక్కువేనట (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : మీకు బట్టతల ఉందా... అయితే మీరు కరోనా విషయంలో అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. బట్టతల ఉండే మగాళ్లకు కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా ఉంటోందని పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన వారికి బట్టతల ఉంటే... దాన్ని గాబ్రిన్ సైన్ అని పిలుస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్‌తో ఫిజీషియన్ డాక్టర్ ఫ్రాంక్ గాబ్రిన్ చనిపోయాక... మిగతా డాక్టర్లు కరోనాతో చనిపోనప్పుడు ఆయనే ఎందుకు పరిశోధించగా... ఆయనకు బట్టతల ఉండటం వల్ల కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కార్లోస్ వాంబియర్ ఈ పరిశోధన చేశారు. ఆయన అంటున్నది ఏంటంటే... బట్టతల ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువ అని, అలాగే బట్టతల ఉంటే... కరోనా తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

చైనా వుహాన్‌లో కరోనా మొదలయ్యాక... చనిపోతున్న వారిలో ఎక్కువగా మగాళ్లే ఉన్నారని తేలింది. బ్రిటన్‌లో కూడా అంతే... మహిళల కంటే... రెట్టింపు సంఖ్యలో మగాళ్లు కరోనాతో చనిపోతున్నారు. ఎందుకిలా అని గమనిస్తే... మగాళ్ల లైఫ్‌స్టైల్, స్మోకింగ్ అలవాట్లు, జన్యుపరంగా మహిళలతో పోల్చితే... మగాళ్ల జన్యువులు కరోనాను తట్టుకునే విషయంలో వీక్‌గా ఉండటం వంటి అంశాలు తెలిశాయి. మగాళ్ల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ వల్లే జుట్టు రాలిపోతుంది. అలాగే... అదే హార్మోన్... కరోనా వైరస్... కణాలపై దాడి చేసేందుకు శక్తిని ఇస్తుందని తాజాగా తేలింది. ఇప్పుడు బట్టతల ఉన్నవారికి కరోనా సోకితే... టెస్టోస్టీరాన్ హార్మోన్‌ను కంట్రోల్ చేసే ట్రీట్‌మెంట్ కూడా అందించడం మేలంటున్నారు డాక్టర్లు.

ప్రొస్టేట్ కాన్సర్ ఉన్నవారికి ప్రత్యేక మందులు ఇస్తారు. కరోనా ఉన్నవారికి కూడా అలాంటి మందులు ఇవ్వడం మంచిదనే ఉద్దేశంతో... అమెరికా... లాస్ ఏంజిల్స్‌, సీటిల్, న్యూయార్క్‌లో 200 మంది పెద్దవారిపై పరిశోధనలు చేస్తున్నారు. స్పెయిన్‌లో కూడా కరోనాతో ఎక్కువగా మగాళ్లు చనిపోతున్నారు. అక్కడ కూడా బట్టతలకూ కరోనాకూ లింక్‌పై పరిశోధన చేస్తున్నారు. అక్కడ కరోనా సోకిన మగాళ్లలో 79 శాతం మందికి బట్టతల ఉంది. అందువల్ల బట్టతల ఉండేవారు కరోనా విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కరోనా సోకినట్లు తేలితే... ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
First published: June 7, 2020, 9:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading