భారత్‌లో కరోనా వచ్చిన వారిలో ఎక్కువగా చనిపోతున్నది వాళ్లే...

Corona Lockdown | Coronaupdate : ఇండియాలో కరోనా వల్ల ఏ వయసువారు ఎక్కువగా చనిపోతున్నారో లెక్కల ద్వారా తెలిసింది.

news18-telugu
Updated: April 8, 2020, 11:50 AM IST
భారత్‌లో కరోనా వచ్చిన వారిలో ఎక్కువగా చనిపోతున్నది వాళ్లే...
భారత్‌లో కరోనా వచ్చిన వారిలో ఎక్కువగా చనిపోతున్నది వాళ్లే... (credit - twitter - Dr C Vijayabaskar )
  • Share this:
Corona Lockdown | Coronaupdate : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 5వేలు దాటి... 5194కి చేరాయి కాబట్టి... మృతుల సంఖ్య కూడా 149 అయ్యింది కాబట్టి... అసలు ఇండియాలో ఏ వయసు వారు ఎక్కువగా చనిపోతున్నారో మనం తెలుసుకోవడం మంచిదే. సోమవారం నాటికి ఇండియాలో 125 మంది చనిపోగా... వాళ్ల సగటు వయసు లెక్కిస్తే... 60 ఏళ్లుగా తేలింది. ఇటలీ వంటి యూరప్ దేశాల్లో ఇది 80 ఏళ్లుగా ఉంది. ఇందుకు కారణం ఇండియాలో ఎక్కువ మంది యువ, మధ్య వయస్సు వాళ్లు కావడమే. ఈ చనిపోతున్నవాళ్లలో కూడా ఎలాంటి వాళ్లు చనిపోతున్నారో కూడా లెక్కలు తేల్చారు.

- ఇండియాలో మొత్తం కరోనా కేసుల్లో చనిపోతున్నవారి శాతం 2.7గా ఉంది.
- 40 ఏళ్ల లోపువారిలో చనిపోతున్నవారి శాతం 0.4గా ఉంది.

- 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారిలో చనిపోతున్న వారి శాతం 2.4గా ఉంది.
- 60 ఏళ్లకు పైబజిన వారిలో చనిపోతున్నవారి శాతం 8.9గా ఉంది.దీన్ని బట్టీ... ఇండియాలో చనిపోతున్నవాళ్లలో పెద్దవాళ్లే (60 ఏళ్లు దాటిన వాళ్లు) ఎక్కువని అర్థం చేసుకోవచ్చు.

మన దేశంలో కరోనా వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. చాలా కేసుల్లో ఈ రెండు అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. ప్రపంచంలో మిగతా దేశాల్లోనూ చనిపోతున్నవారిలో ఎక్కువ మందికి ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి. ఉదాహరణకు చైనాలో చనిపోతున్నవారిలో ఎక్కువ మందికి గుండె జబ్బులు, ఊపిరి తిత్తుల సమస్యలు, డయాబిటెస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి.ఇండియాలో చనిపోయిన వారిలో 86 మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ సమస్యలున్నాయి. వీరిలో 56 శాతం మందికి డయాబెటిస్ ఉండగా... 47 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉంది. అలాగే 86 మందిలో 33 శాతానికి పైగా మందికి రెండు సమస్యలూ ఉన్నాయి. ఇండియాలో చనిపోయిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఆస్తమా లేదా ఊపిరి తిత్తుల సమస్యలు ఉన్నాయి. 16 శాతం మందికి గుండె సమస్యలు ఉన్నాయి. వారికే డయాబెటిస్ లేదా హైపర్ టెన్షన్ సమస్యలు కూడా ఉన్నాయి.

మొత్తం మృతుల్లో 40 శాతం మందికి ముందే రకరకాల అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. 17 శాతం మందికి మూడు రకాల అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. చనిపోయిన వారిలో 35 శాతం మందికి మాత్రమే ఒకటే అనారోగ్య సమస్య ఉంది.

మొత్తంగా చూస్తే... కరోనా వైరస్‌తో చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి డయాబెటిస్ ఉంటోంది. అందువల్ల పెద్దవారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉండేవారు కరోనా విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading