ఏపీ అసెంబ్లీ సమావేశాలకు డేట్స్ ఫిక్స్... ఈసారి ఎలా జరుగుతాయంటే...

Corona Lockdown | Corona Update : జూన్ 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఐతే... ఈసారి అవి కొత్తగా ఉండబోతున్నాయి. కారణం కరోనా.

news18-telugu
Updated: June 7, 2020, 10:18 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు డేట్స్ ఫిక్స్... ఈసారి ఎలా జరుగుతాయంటే...
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు డేట్స్ ఫిక్స్... ఈసారి ఎలా జరుగుతాయంటే... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు జూన్ 16న ప్రారంభం కాబోతున్నాయి. మార్చి నెలలో ఓటాన్ అకౌంట్‌తో సరిపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇందుకోసం 16న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఎప్పట్లాగే తొలిరోజు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రెండు సభలనూ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరపాలి, ఏం చర్చించాలి అనేది ఫైనల్ చేస్తారు. 18న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్... బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 19న ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

కరోనా వైరస్ కారణంగా ఎండాకాలంలో జరిపే అసెంబ్లీ సమావేశాల్ని వేగంగా ముగించారు. అందువలలే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం త్వరగానే సమావేశాల్ని ముగించేయాలనుకుంటోంది. అవతల ఏపీ సెక్రటేరియట్‌లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకిందనే అంశం కలకలం రేపుతోంది. సమావేశాలు జరిగితే... సభ్యులంతా ఎక్కువ సేపు సభలోనే ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల కరోనా ప్రబలే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో... త్వరగా సమావేశాల్ని ముగించేయడమే మంచిదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

ఇక ఈసారి బడ్జెట్ అంత జనరంజకంగా ఉండే అవకాశాలు లేవు. అసలు ప్రభుత్వం దగ్గర నిధులే లేవు. అన్ లాక్‌ -1 ద్వారా చాలా వరకూ మినహాయింపులు ఇచ్చినప్పటికీ... ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టట్లేదు. కారణం ప్రజల దగ్గర డబ్బు లేదు. వాళ్ల దగ్గర డబ్బు ఉంటే... వాళ్లు సరుకులు కొనుక్కోగలరు. అప్పుడు ఉత్పత్తి మొదలై... పరిశ్రమలకు డబ్బులొస్తాయి. తద్వారా వాటిలో ఉద్యోగులకు మనీ వస్తుంది. మళ్లీ కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ ఈ చక్రం ఇప్పుడు రివర్సులో ఉంది. కరోనా ఎంతకీ తగ్గకపోవడం అసలు సమస్యగా మారింది.
Published by: Krishna Kumar N
First published: June 7, 2020, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading