ఏపీ సచివాలయంలో కరోనా... ప్రత్యేక ఆదేశాలు జారీ...

Corona Lockdown | Corona Update : దేశంలో కరోనా పెరుగుతోంది అనేందుకు ఇలాంటి ఘటనలే ఉదాహరణలు అవుతున్నాయి. అత్యంత జాగ్రత్తలు తీసుకునే చోట కూడా కరోనా వచ్చేస్తోంది.

news18-telugu
Updated: May 30, 2020, 12:36 PM IST
ఏపీ సచివాలయంలో కరోనా... ప్రత్యేక ఆదేశాలు జారీ...
ఏపీ సచివాలయంలో కరోనా... ఉద్యోగులకు టెన్షన్... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఏపీ సెక్రటేరియట్ అంటే... మాటలా... ముఖ్యమంత్రి, మంత్రులు అంతా ఉండే కార్యాలయం. అలాంటి చోట కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన ఓ సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతే... రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారందర్నీ... స్వయంగా క్వారంటైన్‌కి వెళ్లమని అధికారులు కోరారు. అంతేకాదు... సికింద్రాబాద్ బస్‌లో అతనితో వచ్చిన ఉద్యోగులంతా క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. కరోనా వచ్చిన ఆ ఉద్యోగి... మంగళగిరి మండలం నవులూరు గోలివారితోటలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు తెలిసింది. అతన్ని మంగళగిరి NRI ఆసుపత్రి కోవిడ్ విభాగానికి తరలిస్తున్నారు.

సమస్యేంటంటే... బస్టాండ్లలో బస్సు ఎక్కేటప్పుడు... థెర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. జ్వరం లేదనీ... టెంపరేచర్ నార్మల్‌గానే ఉందని ఆ మెషిన్ చూపిస్తోంది. ఇక మాస్క్ ఎలాగూ ఉంటుంది. శానిటైజర్ కూడా రాసుకుంటున్నారు కాబట్టి బస్సు ఎక్కనిస్తున్నా్రు. ఐతే... ప్రయాణంలో ఇతరుల నుంచి అతనికి కరోనా సోకిందని అనుకోలేం. ఎందుకంటే... రెండ్రోజుల కిందటేగా ప్రయాణించింది. కరోనా బస్సులో ఇతరుల నుంచి అతనికి సోకి ఉంటే... ఓ వారమో, 10 రోజుల తర్వాతో అది బయటపడేది. కానీ ఇప్పుడే బయటపడిందంటే... అతనికి 10 రోజుల కిందటే కరోనా సోకి ఉండొచ్చని మనం అనుకోవచ్చు.

చాలా దేశాల్లో లాగే... మన దేశంలో కూడా అసింప్టమేటిక్ కరోనా కేసులున్నాయి. అంటే... మన చుట్టూ ఉండేవారిలో ఒకరో ఇద్దరికో కరోనా ఉండి ఉండొచ్చు. ఆ విషయం వాళ్లకూ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఏ లక్షణాలూ కనిపించవు. బట్, వాళ్ల ద్వారా ఇతరులకు అది సోకుతుంది. కాబట్టి... మనం ఉండే ఏరియాలో కరోనా కేసులు లేవు కదా అని రూల్స్ దాటకండి. ఎసింప్టమేటిక్ కేసులు ఉంటే... అడ్డంగా బుక్కైపోతాం అంటున్నారు నిపుణులు.
Published by: Krishna Kumar N
First published: May 30, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading