లాక్‌డౌన్‌లో బయటికొచ్చి బుక్కయ్యారుగా... ఎక్కడో తెలుసా..?

Corona Lockdown | Coronaupdate : ఓవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే... మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాని అంతుచూసేందుకు కష్టపడుతున్నాయి.

news18-telugu
Updated: April 8, 2020, 2:07 PM IST
లాక్‌డౌన్‌లో బయటికొచ్చి బుక్కయ్యారుగా... ఎక్కడో తెలుసా..?
లాక్‌డౌన్‌లో బయటికొచ్చి బుక్కయ్యారుగా... ఎక్కడో తెలుసా..?
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కి పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం... ఎవర్నీ ఉపేక్షించవద్దు... రూల్స్ అతిక్రమిస్తే... గుర్తు చెయ్యండి వారికి అని ఆర్డర్లు వేసింది. దాంతో పోలీసులు... ఎండల్ని లెక్క చెయ్యకుండా... ఎవరు అతిక్రమిస్తే వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో... పశ్చిమ గోదావరి జిల్లా... ఏలూరు 2 టౌన్‌లో... అశోక్ నగర్ బ్రిడ్జి ఖాళీగా ఉంది. అది చూసిన ఇద్దరు కుర్రాళ్లలో ఒకడ‌ు... "అరే... వంతెన చూడు... ఎంత ఖాళీగా ఉందో... అలా ఓ రౌండ్ వేద్దాం రా... అని అనగా... మరొకడు "వద్దులేరా... ఎందుకొచ్చింది... ఏ పోలీసులో పట్టుకున్నారనుకో... తాట తీసేత్తారు" అన్నాడు. "అంత లేదు లేరా... పోలీసులు కంటిన్యూగా ఎక్కడ కాపలా కాత్తారు... ఆళ్లకు బోల్డు పనులుంటాయ్... ఇలాంటి చిన్నచిన్నయ్ పట్టించుకోరు" అన్నాడు. "నాకైతే తేడా కొడతంది" అన్నాడు. "నేనున్నాగా... యెనక అలా కూచ్చో... నేను నడుపుతాగా... పోలీసులు కనిపించారనుకో... అలా తిప్పేత్తా... ఏమనుకుంటున్నావ్ నన్ను" అంటూ... ఇంట్లోంచీ బయటికొచ్చి... సరిగా స్టాండ్ లేకపోయినా కుయ్యో మొర్రో అని మూలుగుతూ పక్కకు వాలి ఉన్న బైకును స్టార్ట్ చేశాడు. ఇద్దరూ... ఖాళీ రోడ్లపై అలా అలా వెళ్తుంటే... ఓ చోట... ASI గోపి వాళ్లను చూశారు. అంతే... బైక్ యూటర్న్ తిప్పేద్దామనుకుంటుంటే... "రేయ్... ఎక్కడికిరా పోతారు... ఆగో" అంటూ పోలీస్ ఆపేశారు.

India Trusts Pm Modi, extend the lockdown, corona update, coronavirus outbreak, coronavirus lockdown, coronaupdate, fight with corona virus, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, తెలుగు వార్తలు,
లాక్‌డౌన్‌లో బయటికొచ్చి బుక్కయ్యారుగా... ఎక్కడో తెలుసా..?


"నేన్ చెప్పానా" అని వెనక కుర్రాడు నసుగుతుంటే... "రేయ్... సైలెంటుగుండరా... నాకు టెన్షన్ గుంది" అన్నాడు ముందోడు. పోలీసు వాళ్ల బైక్ పక్కన పెట్టించి... రోడ్డు పైకి రమ్మన్నారు. ఇద్దరూ వణుకుతూ వచ్చారు. "గుంజీలు తియ్యండ్రా" అని ఆర్డరేసేసరికి ఇద్దరూ తియ్యడం మొదలుపెట్టారు. ఆ సమయంలో... కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో, దానికి దొరికితే... ఎలా ఇబ్బంది పెడుతుందో అన్నీ ఆ పోలీస్ వివరించారు. అంతేకాదు రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయో కూడా చెప్పారు. "ఇంకెప్పుడైనా ఇలా చేస్తారా" అని అడిగితే... ఆ ఇద్దరూ... చెయ్యం సార్... ప్లీజ్ సార్ అని బతిమలాడుకున్నారు. ఆ ASI... వీళ్లను తీసుకెళ్తే... ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడొచ్చు... ఈసారికి వదిలేద్దాం అనుకొని వాళ్లను వదిలేశారు.

ఆ మధ్య పోలీసులు... ఇలా రూల్స్ అతిక్రమించిన వాళ్లను లాఠీలతో కొడుతుంటే... అంతా వాళ్లపై సీరియస్ అయ్యారు. ఇంగ్లండ్, అమెరికా లాంటి చోట్ల మొదట్లో ఏ చర్యలూ తీసుకోకపోబట్టే... అక్కడ కరోనా కేసులు లక్షల్లో ఉన్నాయి. మన ఇండియాలో ఇలాంటి కట్టుదిట్టమైన చర్యల వల్లే కరోనా కేసులు వేలల్లోనే ఉన్నాయి. రూల్స్ ఉన్నది మన క్షేమం కోసమేగా... పాటించేస్తే పోయే.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading