ఏపీలో రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్ ఎత్తివేత... ఇవీ మార్గదర్శకాలు...

Corona Lockdown | Corona Update : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి లాక్‍‌డౌన్ వెసులుబాట్లు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వాటిని పాటిస్తోంది.

advertorial
Updated: April 19, 2020, 9:19 AM IST
ఏపీలో రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్ ఎత్తివేత... ఇవీ మార్గదర్శకాలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Advertorial
  • Last Updated: April 19, 2020, 9:19 AM IST
  • Share this:
Corona Lockdown | Corona Update : లాక్‌డౌన్ వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వస్తోందని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. అదే సమయంలో... కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌పై కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో... ఏపీ ప్రభుత్వం కూడా వాటిని లెక్కలోకి తీసుకొని... కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం... రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అదే సమయంలో... సోషల్ డిస్టాన్సింగ్, ముఖాలకు మాస్కులు తొడుక్కోవడం, గుంపులుగా ఉండకుండా దూరం దూరంగా ఉండటం అనే నిబంధనలు కొనసాగనున్నాయి.

ఏపీలో లాక్‌డౌన్ మినహాయింపులు :

- అత్యవసర వస్తుత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపులు.
- కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు.

- లాక్ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలిస్తూ ఆదేశాలు జారీ.

- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం.

- ఉత్తర్వులను కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమలశాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు పంపిన ప్రభుత్వం.- రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు.

- ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, మందుల తయారీ కంపెనీలకు మినహాయింపు.

- సబ్బులు తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్ల తయారీ సంస్థలకు మినహాయింపు.

- శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు.

- ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు

- అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు మినహాయింపు.

- ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు
Published by: Krishna Kumar N
First published: April 19, 2020, 9:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading