జోరుగా కొత్త కేసులు... పెరిగిన మరణాలు... కబళిస్తున్న కరోనా...

Corona Lockdown | Corona Update : తగ్గినట్టే తగ్గి కరోనా మళ్లీ పెరుగుతోంది. అమెరికాలో ఒక్కసారిగా వెయ్యి మరణాలు పెరిగాయి.

news18-telugu
Updated: May 13, 2020, 5:41 AM IST
జోరుగా కొత్త కేసులు... పెరిగిన మరణాలు... కబళిస్తున్న కరోనా...
జోరుగా కొత్త కేసులు... పెరిగిన మరణాలు... కబళిస్తున్న కరోనా... (credit - WHO)
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రపంచ దేశాల్ని కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. కొత్త కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా 84605 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 4336895కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 5238 మరణాలు సంభవించడంతో... మొత్తం మరణాల సంఖ్య 292369కి చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో యాక్టివ్ కేసులు 2448005గా ఉన్నాయి. వీటిలో 46361 కేసుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. మంచి విషయమేంటంటే... తీవ్ర కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. అంటే... మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోందని అనుకోవచ్చు లేదా కరోనా వైరస్ బలహీన పడుతోందని అనుకోవచ్చు. శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వైరస్ మరింత బలపడుతోందని అంటున్నారు. వైరస్ వ్యాప్తి మాత్రం పెరుగుతూనే ఉంది.

అమెరికాలో కొత్తగా 22239 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 1408073కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 1573 మంది చనిపోవడంతో... మృతుల సంఖ్య 83368కి చేరింది. గత నాలుగైదు రోజులుగా మృతుల సంఖ్య రోజూ 1000 లోపే ఉండగా.. నిన్న మాత్రం బాగా పెరిగింది.

ప్రస్తుతం అమెరికా తర్వాత కరోనా వైరస్... రష్యా (10899), బ్రెజిల్ (8459), ఇండియా (3604), బ్రిటన్ (3403), పెరు (3237), టర్కీ (1704)లో ఎక్కువగా నమోదవుతోంది. ఈ లిస్టులో ఇండియా నాలుగో స్థానంలో ఉండటం మనకు ఇబ్బందికర అంశం.

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 70756కు చేరింది. కొత్తగా 3,604 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 46008 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 22454 మంది డిశ్చార్జి అయ్యారు. 2293 మంది కరోనా సోకి మరణించారు. మహారాష్ట్రలో మొత్తం 23,401 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 24 గంటల్లోనే 1230 కొత్త కేసులు వచ్చాయి.

తెలంగాణలో మంగళవారం మరో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 37 హైదరాబాద్‌లో నమోదవగా.. మరో 14 మంది వలస కార్మికులు ఉన్నారు. తాజాగా మరో 21 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మరో రెండు మరణాలు నమోదయ్యాయి. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1326కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 822 మంది డిశ్చార్జి కాగా.. 32 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 472 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

ఏపీలో కొత్తగా 33 పాజిటివ్ కేసులొచ్చాయి. 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2051కు చేరింది. 1056 మంది డిశ్చార్జ్ కాగా గత 24 గంటల్లో ఒక వ్యక్తి మరణించాడు. ప్రస్తుతం 949 మంది చికిత్స పొందుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 5:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading