రెస్టారెంట్ కస్టమర్లకు ట్యూబులు... సోషల్ డిస్టాన్స్‌కి వచ్చిన తిప్పలు...

రెస్టారెంట్ కస్టమర్లకు ట్యూబులు... సోషల్ డిస్టాన్స్‌కి వచ్చిన తిప్పలు... (credit - reuters)

Corona Lockdown | Corona Update : సోషల్ డిస్టాన్స్ తప్పనిసరి కావడంతో... రకరకాల రెస్టారెంట్లు రకరకాల ప్లాన్స్ వేస్తున్నాయి. ఈ ట్యూబుల సంగతేంటో తెలుసుకుందాం.

 • Share this:
  Corona Lockdown | Corona Update : కరోనా కాలంలో ఆరు అడుగుల సోషల్ డిస్టాన్స్ తప్పనిసరి కదా. ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఎవరు పాటించకపోయినా... మిగతా వాళ్లకు ఇబ్బందే. అందువల్ల ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లు తెరుస్తున్న యాజమాన్యాలు... సోషల్ డిస్టాన్స్ కచ్చితంగా పాటించేలా... రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. వాటిలో ఈ ట్యూబ్ ప్లాన్ ఒకటి. అమెరికా... మేరీలాండ్‌... ఓషన్ సిటీలో... ఫిష్ టేల్స్ రెస్టారెంట్... ఈ పని చేసింది. వచ్చే కస్టమర్లందరికీ... ఇన్‌ఫ్లాటబుల్ ట్యూబులు ఇస్తోంది. వాళ్లు ఆ ట్యూబులో దూరాలి. కింద... వీల్స్ ఉంటాయి. కాబట్టి... ఆ ట్యూబును అలా ముందుకు తోసుకుంటూ రెస్టారెంట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.


  రెస్టారెంట్‌లో టేబుళ్లేవీ ఉండవు. ప్రతీ ట్యూబూ ఓ టేబులే. దాని పైనే మెనీ ఐటెమ్స్ ఉంచుతారు. నిల్చొనే తినాల్సి ఉంటుంది. అందుకే వీటిని ట్యూబులు అని కాకుండా... బంపర్ టేబుల్స్ అని పిలుస్తోంది ఆ రెస్టారెంట్. ఇదివరకు 50 మందికి సరిపడా టేబుళ్లు పట్టే ప్రదేశంలో ఇప్పుడు 10 ట్యూబులే పడుతున్నాయి. దాంతో... పార్కింగ్ స్లాట్ ఏరియాలోనూ ఈటింగ్ సెక్షన్ పెట్టేసింది యాజమాన్యం.


  ఇది కొద్దిగా ఇబ్బంది కరమే అయినప్పటికీ... మన మంచికే కదా అనుకుంటూ అంతా ఫాలో అవుతున్నారు. కార్లను నడిపినట్లుగా... ఈ ట్యూబులను ఓ క్రమ పద్ధతిలో నడపడం నేర్చుకుంటున్నారు. ఇది చూసిన బయటి వాళ్లు "సోషల్ డిస్టాన్స్‌‍కి వచ్చిన తిప్పలివి. ఏం రోజులొచ్చాయిరా బాబూ" అనుకుంటున్నారు.


  థాయ్‌ల్యాండ్‌లో ఇలాగే ఓ రెస్టారెంట్... టేబుళ్ల దగ్గర పాండా బొమ్మలను పెట్టింది. తద్వారా బొమ్మ ఉన్న టేబుల్‌పై ఎవరూ కూర్చునే ఛాన్స్ ఉండకుండా చేసింది. ఫలితంగా సోషల్ డిస్టాన్స్ కచ్చితంగా అమలవుతోంది.
  Published by:Krishna Kumar N
  First published: