చైనాలో 40 శాతం పెరిగిన కరోనా కేసులు ... వైరస్ తిరగదోడిందా?

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్ చైనాలో తగ్గినట్లే తగ్గి... మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదెలాగో లెక్కల ప్రకారం చూద్దాం.

news18-telugu
Updated: April 15, 2020, 1:58 PM IST
చైనాలో 40 శాతం పెరిగిన కరోనా కేసులు ... వైరస్ తిరగదోడిందా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Coronaupdate : క్లోజ్‌డ్ ఎకానమీగా ఉండే చైనాలో... కరోనా కేసుల లెక్కలు నిజమేనా? చైనా ప్రభుత్వం వాస్తవాలే చెబుతోందా... అంటే... రకరకాల డౌట్లు వస్తున్నాయి పరిశోధకులకు. తమ దేశంలో కరోనా పూర్తిగా కంట్రోల్ అయిపోయిందంటూ... ఏప్రిల్ 8న చైనా ప్రభుత్వం వుహాన్ నగరంలో విధించిన 76 రోజుల లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఆ తర్వాత ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతుంటే... మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 99 మందికి కరోనా సోకగా... బుధవారం ఇప్పటికే... 46 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒకరు మృతి చెందారు.

చైనాలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసులు 82295. వాటిలో... రికవరీ అయిన కేసులు... 77816. చనిపోయిన వారి సంఖ్య 3342. ఐతే... లాక్‌డౌన్ ఎత్తివేసి వారమైంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత... కొత్తగా 384 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇప్పటివరకూ మరో 46 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 430గా ఉంది. అందువల్ల ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య చైనాలో 1137గా ఉంది. ఈ వారమంతా... లాక్‌డౌన్ నుంచి బయటికి వచ్చిన వారు... తిరుగుతూనే ఉన్నారు. కొంత వరకు స్వయంగా సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్నప్పటికీ... మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటం... చైనాతోపాటూ... ప్రపంచానికీ ఆందోళన కలిగిస్తున్న అంశం.

చైనాలో మార్చి 25 నాటికి 81285 కేసులున్నాయి. ఏప్రిల్ 8 నాటికి అంటే... లాక్‌డౌన్ ఎత్తేసే నాటికి 81865 కేసులున్నాయి. అంటే... 14 రోజుల గ్యాప్‌లో కొత్తగా నమోదైన కేసులు... 580. కానీ... లాక్‌డౌన్ ఎత్తేశాక... వారం రోజుల్లో నమోదైన కేసులు... 430గా ఉన్నాయి. అంటే... లాక్‌డౌన్ ఎత్తేశాక... చైనాలో కరోనా కేసుల జోరు... 40 శాతం పెరిగినట్లే. చైనా విదేశీ విమానాల్లో తమ దేశానికి వస్తున్న వారి వల్లే ఈ కొత్త కేసులు నమోదవుతున్నాయని చెబుతోంది. ఏది ఏమైనా చైనా జాగ్రత్తలు తీసుకోకపోతే... కరోనా 2 అక్కడ వ్యాపించే ప్రమాదం ఉన్నట్లే.
Published by: Krishna Kumar N
First published: April 15, 2020, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading