23 లక్షల కేసులు... 1.60 లక్షల మృతులు... ప్రపంచాన్ని చావగొడుతున్న కరోనా...

Corona Lockdown | Corona Update : 2019 వరకు ప్రపంచం ఒకలా ఉంటే... ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంది. ఇది ఎవరూ ఊహించని ఉత్పాతమే.

news18-telugu
Updated: April 19, 2020, 5:18 AM IST
23 లక్షల కేసులు... 1.60 లక్షల మృతులు... ప్రపంచాన్ని చావగొడుతున్న కరోనా...
23 లక్షల కేసులు... 1.60 లక్షల మృతులు... ప్రపంచాన్ని చావగొడుతున్న కరోనా... (credit - who.sprinklr)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఈ ప్రపంచానికి ఏమైంది అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ కరోనా మహమ్మారి త్వరలోనే వదిలిపోతుంది అని కొందరు... లేదు లేదు... ఇది కొంత కాలం ఉంటుంది అని మరికొందరు... ఒక్క విషయంలో మనం పాజిటివ్‌గా ఆలోచించొచ్చు. ఏంటంటే... ఈ ఏడాదిలోనే కచ్చితమైన మందు (వ్యాక్సిన్) తయారవుతుందని ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వంద శాతం నమ్మకంతో ఉన్నారు. వ్యాక్సిన్ తయారైతే... ఇక కరోనాకి మామూలుగా ఉండదు. ఎందుకంటే... ఇప్పటికే... శనివారం కొత్తగా 76472 మంది కరోనా బారిన పడటంతో... మొత్తం కేసుల సంఖ్య 2325335కి చేరింది. ఐతే... ఈ సంఖ్యలో రికవరీ అయిన వారు 595519 మంది ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 1569368గా ఉంది. వీళ్లలో 1514147 మందికి కరోనా ఉన్నా, లేనట్లే. ఎందుకంటే వాళ్లకు చాలా తక్కువగా ఉంది. కోలుకునే ఛాన్స్ 99 శాతం ఉంది. ఇక 55221 మంది మాత్రం చనిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మృతుల సంఖ్య 160448కి చేరింది.

అమెరికాలో శనివారం కొత్తగా 27482 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 737217కి చేరాయి. అలాగే... శనివారం 1778 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 38932కి చేరింది. ట్రంప్ చెబుతున్నట్లు అమెరికాలో కరోనా కంట్రోల్ కాలేదు. కొనసాగుతూనే ఉంది.

స్పెయిన్‌లో శనివారం 887 కేసులు రావడంతో... మొత్తం కేసులు 191726గా ఉన్నాయి. శనివారం 637 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 20639గా ఉంది.

షాకింగ్ విషయమేంటంటే... తగ్గింది కదా అనుకుంటున్న యూరప్ దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లో కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నాలుగు దేశాల్లో కలిపి శనివారం కొత్తగా... 14వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఆందోళనకర అంశమే. ఎందుకంటే... చైనా తర్వాత కరోనా వచ్చింది యూరప్‌లో కాబట్టి... చైనాలో తగ్గినట్లుగా... యూరప్ లోనూ కరోనా తగ్గాల్సిందే. అలా జరగకపోవడం ఇబ్బందికరమే.

ఇక చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82719గా ఉన్నా... ప్రస్తుతం ఆ దేశంలో ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నవారి సంఖ్య 1058 మాత్రమే. అంటే... ఆ దేశం ఈ నెలాఖరుకల్లా.. కరోనా నుంచి పూర్తిగా బయటపడే ఛాన్స్ ఉంది. ఐతే... చైనా చెబుతున్న లెక్కలు నిజమేనా కాదా అన్న డౌట్ అన్ని దేశాలకూ ఉంది.

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అది 14792గా ఉండగా... వారిలో 2015 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ 488 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

తెలంగాణలో కొత్తగా మరో 43 మందికి కరోనా వచ్చింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. 18 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 605గా ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 36 మందికి కరోనా వచ్చింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 603కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 58 మంది కోలుకున్నారు. 16 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 545గా ఉంది.
First published: April 19, 2020, 5:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading