ఏపీలో కరోనా బీభత్సం... ఒకే రోజు... 161 మందికి పాజిటివ్... ఏం జరుగుతోంది?

Corona Lockdown | Corona Update : ఇన్నాళ్లూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్... ఇప్పుడు ఏపీలోని చాలా వీధుల్లో, సంధుల్లోకి వచ్చేసింది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

news18-telugu
Updated: June 6, 2020, 1:02 PM IST
ఏపీలో కరోనా బీభత్సం... ఒకే రోజు... 161 మందికి పాజిటివ్... ఏం జరుగుతోంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజూ లాగానే... మరో 12771 శాంపిల్స్‌ని చెక్ చెయ్యగా... వాటిలో 161 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మధ్య మూడ్రోజులుగా ఏపీలో కరోనా తగ్గినట్లు కనిపించింది. కొత్త కేసుల జోరు తగ్గినట్లు అనిపించింది. తీరా చూస్తే... ఇప్పుడు వచ్చిన రిపోర్టును బట్టీ... ఏమాత్రం జోరు తగ్గలేదని అర్థమవుతోంది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసులు 3588గా ఉన్నాయి. వాటిలో 2323 మంది డిశ్చార్జి అయ్యారు. 73 మంది చనిపోయారు. గత 24 గంటల్లో ఎవరూ చనిపోలేదు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1192గా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 29 మందిని డిశ్చార్జి చేసింది.

ఏపీలో విదేశాల నుంచి వచ్చి 131 మందికి కరోనా ఉంది. వారిలో 127 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కరోనా పాజిటివ్ సంఖ్య 741గా ఉంది. వారిలో 467 మందికి ప్రస్తుతం కరోనా యాక్టివ్ అని తేల్చారు. ఆ 467 మందిలో 16 మందిని ఇవాళ డిశ్చార్జి చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి యాక్టివ్‌గా ఉన్న వారి కేసుల సంఖ్య 594. మొత్తం యాక్టివ్ కేసుల్లో సగం వీళ్లే ఉన్నారు. మిగతా సగం స్థానికులకు వచ్చినట్లు లెక్క. మనం ఇలా ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా... ఏపీ, తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయన్నది నిజం. చూస్తుంటే డిసెంబర్ వరకూ ఇదే పరిస్థితి ఉంటుందేమో అనిపిస్తోంది. డిసెంబర్‌లో వ్యాక్సిన్ వచ్చాకే కరోనా తగ్గుతుందేమో అంటున్నారు నిపుణులు. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండటమే ఎవరైనా చెయ్యాల్సింది.
First published: June 6, 2020, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading