కరోనాను జయించి... కోల్డ్ బీర్ తాగిన 103 ఏళ్ల అవ్వ...

Corona Lockdown | Corona Update : కరోనా అంతు చూడాలి, కరోనాకి లొంగకూడదు, కరోనాను ఎట్టి పరిస్థితుల్లో పెరగనివ్వను... ఇలా ఆమె బలంగా నిర్ణయించుకుంది.

news18-telugu
Updated: June 1, 2020, 11:34 AM IST
కరోనాను జయించి... కోల్డ్ బీర్ తాగిన 103 ఏళ్ల అవ్వ...
కరోనాను జయించి... కోల్డ్ బీర్ తాగిన 103 ఏళ్ల అవ్వ... (credit - twitter - American Craft Beer)
  • Share this:
Corona Lockdown | Corona Update : సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే అని పెద్దలు చెబుతారు కదా. అది నిజం అని ఆ పెద్దల్లోనే ఒకరైన ఈ పెద్దావిడ చెప్పారు. వయసు 103 ఏళ్లు. అమెరికా... మసాచుసెట్స్‌లో ఉంటోంది. కరోనా బారిన పడింది. కుటుంబ సభ్యులు ఇక ఆమె మనకు లేనట్లే అని అనేసుకున్నారు. ఏప్రిల్ చివర్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రి వర్గాలేమో... హాస్పిటల్‌కి తేవొద్దనీ... ఇంట్లోనే ఉంచి మందులు వాడమని చెప్పారు. ఎందుకంటే... ఆ డాక్టర్లకు కూడా పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులేమో... అంత్యక్రియలు ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరిని పిలవాలి... వంటి లెక్కలేసుకోసాగారు.

ముసలామెకు నానాటికీ కరోనా పెరగసాగింది. ఆకలి పోయింది. రాత్రి వేళ ఏమీ తినేది కాదు. తాగేది కాదు. ఏదైనా తిను అంటే... ఏదో చెప్పేది. అది వాళ్లకు సరిగా అర్థమయ్యేది కాదు. ఇక ఆ ఇంటికి పెద్ద పెద్ద వాళ్లు... రావడం... ముసలామెను దూరం నుంచి చూసి జాలి పడటం వంటివి కామన్ అయ్యాయి. ముసలామె పోకుండానే... బంధువులు కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం కూడా జరిగింది.

ఐతే ఆ అవ్వ... చాలా బలంగా డిసైడైంది. కరోనాను ఎట్టి పరిస్థితుల్లో జయించాలనుకుంది. లేని శక్తి మొత్తం కూడేసుకుంటూ... ఏరోజు కారోజు సవాలుగా తీసుకుంది. ఆమెలో పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ కరోనాను నెగెటివ్‌గా చేశాయి. కొన్ని రోజుల తర్వాత ఆమెలో మార్పు కనిపించింది. మళ్లీ కోలుకుంటున్నట్లుగా అనిపించింది. మే 8న మరోసారి టెస్ట్ చేశారు. ఈసారి కరోనా నెగెటివ్ అని వచ్చింది. ఏ లక్షణాలూ లేవని తేల్చారు. ఆశ్చర్యపోవడం కుటుంబ సభ్యులు, డాక్టర్ల వంతైంది.

తాజాగా నర్సులు ఆమెను చూసేందుకు వచ్చినప్పుడు... ఇక నాకు ఏం కాదు... నేను అప్పుడే పోను అని ముసలామె కాన్ఫిడెన్స్‌తో చెప్పడం అందరికీ ఆనందం కలిగించింది. మరి ఈ శుభ సందర్భంగా ఏం చేస్తావ్ అని అడిగినప్పుడు... ఓ చల్లటి బీర్ ఇవ్వండి... తాగేస్తా అంది. ఆమెకు ఐస్ కోల్డ్ బీర్ అంటే బాగా ఇష్టం. ఇచ్చారు, తాగి పరమానందం పొందింది. ఇప్పుడామె ఎంతో మంది కరోనా పేషెంట్లకు ప్రేరణగా మారింది. (బీర్ తాగడానికి కాదు... కరోనాను జయించడానికి)
First published: June 1, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading