కరోనా 100 కోట్ల మందికి సోకే ప్రమాదం... భయపెడుతున్న రిపోర్ట్...

Corona Lockdown | Corona Update : 100 కోట్ల మందికి కరోనా ఎందుకు సోకుతుంది? ఇలాంటి అసత్య, అనూహ్య హెచ్చరికలు చెయ్యవచ్చా అన్నది తేలాల్సిన అంశం.

news18-telugu
Updated: April 29, 2020, 7:33 AM IST
కరోనా 100 కోట్ల మందికి సోకే ప్రమాదం... భయపెడుతున్న రిపోర్ట్...
కరోనా 100 కోట్ల మందికి సోకే ప్రమాదం... భయపెడుతున్న రిపోర్ట్... (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : ది ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (IRC)... ఇదో సహాయ గ్రూప్. తాజాగా ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. దాంట్లో... ప్రపంచవ్యాప్తంగా కరోనా... 100 కోట్ల మందికి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. IRC ఏమంటోందంటే... పేద, ఇతర దేశాలపై ఆధారపడే దేశాలకు తగిన సాయం చెయ్యకపోతే... ఆ దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని తన రిపోర్టులో తెలిపింది. ఇక్కడ పేద దేశాలంటే... ఆఫ్రికాలోని దేశాలతోపాటూ... ఆప్ఘనిస్థాన్, సిరియా లాంటి దేశాలన్నమాట. ఈ దేశాల్లో జనాభా సంఖ్య ఎక్కువ. పేదలు ఎక్కువ. సంపన్న దేశాలతో పోల్చితే పరిశుభ్రత చాలా తక్కువ. ఇక కాలుష్యం, ఆకలి బాధలు, కరవు సమస్యలు ఎప్పుడూ ఉండేవే. అందువల్ల ఈ దేశాల్లో కరోనా అంత త్వరగా వదలదనీ, వీటిని ఆర్థికంగా ఆదుకోకపోతే... 100 కోట్ల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని IRC రిపోర్ట్ చెప్పినట్లుగా... BBC తెలిపింది.

ఐదు నెలల కిందట ఒకరిద్దరితో మొదలైన కరోనా... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా వ్యాపించింది. 2.17 లక్షల మందిని చంపేసింది. ఇది ఇంతలా వ్యాపిస్తుందని డిసెంబర్‌లో ఎవరూ ఊహించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), లండన్‌లోని ఇంపెరియల్ కాలేజీ డేటాను క్రోఢీకరించి... IRC తన రిపోర్టును తయారుచేసింది. ప్రస్తుతం రోజూ 60 వేల నుంచి 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటాన్ని తేలిగ్గా తీసుకోవద్దంటున్న IRC... అనేక యుద్ధాల వల్ల దెబ్బతిన్న దేశాల్లో ఇది మరింత భయంకరంగా మారుతుందని అంటోంది.

IRC చెప్పినట్లు పేద దేశాల్ని ఆదుకునే పరిస్థితైతే ఇప్పుడు లేదు. అమెరికా సహా అన్ని దేశాల్లోనూ ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. ఆప్ఘనిస్థాన్‌ను ఇప్పటికీ ఆదుకుంటున్న ఇండియా పరిస్థితీ దారుణంగానే ఉంది. ప్రభుత్వాల ఖజానాలన్నీ ఖాళీ అవుతుంటే... ఇక ఇతర దేశాల్ని ఆదుకోవడం కుదిరే పనేనా అన్నది తేలాల్సిన ప్రశ్న. IRC మాత్రం చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో (భారత్ లాంటి వాటిలో)... కరోనా చాలా ఎక్కువ మందికే ఉన్నా... టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వాస్తవ లెక్కలు బయటకు రావట్లేదని అంటోంది. చాలా సంపన్న దేశాల్లో టెస్టులు పెరిగేకొద్దీ కేసుల సంఖ్య కూడా పెరగడాన్ని ఉదాహరణగా చెబుతోంది.
Published by: Krishna Kumar N
First published: April 29, 2020, 7:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading