COVID-19 : కరోనా రెండో విలయం : లక్షణాలు, ఇబ్బందులు మరియు నివారణ..పూర్తి వివరాలు..

COVID-19 : కరోనా రెండో విలయం : లక్షణాలు, ఇబ్బందులు మరియు నివారణ..పూర్తి వివరాలు..

COVID-19 : ఉన్న భయాలకు తోడుగా మరింత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే COVID-19 కొత్త మ్యూటంట్ స్ట్రెయిన్ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు నిపుణులు దీని మీద పరిశోధన చేస్తుండగా, మరోవైపు వైరాలజిస్ట్‌లు ఈ కొత్త స్ట్రెయిన్‌ను విశ్లేషించి, వ్యాప్తిని నివారిస్తూ దాని వల్ల కలిగే లక్షణాలు, ఇబ్బందుల గురించి తెలియజేస్తున్నారు.

 • Share this:
  భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాండమిక్ రెండో వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీన్ని కట్టడి చేసే క్రమంలో వ్యాప్తిని అడ్డుకుని, చెయిన్ బ్రేక్ చేయడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు వివిధ రకాల నియమనిబంధనలు, నిషేధాలను విధిస్తున్నాయి.ఏప్రిల్ 22, 2021 నాటికి, భారతదేశంలో 3,15,735 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి (మొత్తంగా 22,84,411 యాక్టివ్ COVID-19 కేసులు ఉన్నాయి). ఎక్కువగా మహారాష్ట్రలో ఈ కేసులు ఉన్నాయి. ఉన్న భయాలకు తోడుగా మరింత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే COVID-19 కొత్త మ్యూటంట్ స్ట్రెయిన్ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు నిపుణులు దీని మీద పరిశోధన చేస్తుండగా, మరోవైపు వైరాలజిస్ట్‌లు ఈ కొత్త స్ట్రెయిన్‌ను విశ్లేషించి, వ్యాప్తిని నివారిస్తూ దాని వల్ల కలిగే లక్షణాలు, ఇబ్బందుల గురించి తెలియజేస్తున్నారు. 60+ వయస్సు దాటి ఉండి, ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర అనారోగ్యానికి గురై ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ COVID-19 ఎవరికైనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురికావొచ్చు లేదా వయస్సుతో సంబంధం లేకుండా జబ్బు బారిన పడవచ్చు.

  జ్వరం, పొడి దగ్గు, అలసట COVID-19లో సాధారణంగా కనిపించే లక్షణాలు. కానీ కొందరు పేషెంట్‌లలో శ్వాసలో ఇబ్బంది, రుచి లేదా వాసన పోవడం, ఛాతీ నొప్పి, ముక్కు దిబ్బడ, కంజెక్టివైటిస్, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాలు లేదా కీళ్ల నొప్పి, దురద, కళ్లు తిరగడం లేదా వాంతులు, డయేరియా, మత్తుగా ఉండటం లాంటి ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే టెస్ట్ చేయించుకుని, సమయానికి మెడికల్ సంరక్షణ తీసుకోవాలి. గుర్తించబడని లక్షణ రహిత కేసులు అంటే వ్యాధి సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించని వారు ప్రధాన సమస్య. వీరికి తెలియకుండానే ఎక్కువ మందికి వ్యాధిని వ్యాపింపజేస్తారు.
  సామాజిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి, గాలి ప్రసరించే గదులలో ఉండాలి, గుంపుల్లో తిరగవద్దు లేదా ఇతరులకు దగ్గరగా వెళ్లొద్దు, పరిశుభ్రంగా ఉండాలి అంటూ ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు నిరంతరంగా మెసేజ్‌లు పంపిస్తున్నారు. పరిశుభ్రతలో భాగంగా మీ చేతులకు శానిటైజర్ రుద్దుకోవాలి, తరచుగా సబ్బుతో చేతులను కడుక్కోవాలి.

  కళ్లను, ముక్కును, నోటిని అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు. అలాగే తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకుని లేదా టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఎక్కువగా తాకే ప్రదేశాలను, ఉపరితలాలను తరచుగా శుభ్రం చేయాలి/ డిస్‌ఇన్ఫెక్ట్ చేయాలి. మీకు COVID-19 లక్షణాలు ఉన్నట్లు అనిపించినా లేదా COVID-19 లక్షణాలు ఉన్నవారికి దగ్గరగా మీరు వెళ్లినట్లు సందేహం ఉన్నా వెంటనే టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం.ప్రస్తుతం, చాలా ప్రభుత్వ కేంద్రాల్లో RT-PCR టెస్ట్‌లు ఉచితంగా చేసే COVID టెస్టింగ్ సౌకర్యాలు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ హాస్పిటళ్లు డబ్బులు తీసుకుని ఇంటికే వచ్చి శాంపిల్ సేకరించి, వారి ల్యాబ్‌లలో టెస్ట్‌లు చేస్తున్నారు. రోజువారీగా టెస్టుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో నిర్ధారణ అయిన కేసుల సమాచారం అందుకోవడంలో ఇబ్బంది పెరిగింది. కాబట్టి, COVID లక్షణాలు ఉన్నవారు టెస్ట్ ఫలితం కోసం ఆగకుండా వారే స్వయంగా ఇంటికే పరిమితం కావాలి. త్వరిత టెస్టింగ్, సరైన సమయంలో చికిత్స, COVID-సానుకూల ప్రవర్తన, వాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తిని నివారించి, మరణాల రేటును తగ్గించవచ్చు.

  COVID-19 లక్షణాలు ఉన్నవారు ఎవరైనా, ఇంట్లోనే లేదా, ఏదైనా COVID టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ అని తేలితే, మొదటగా ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న స్థానిక COVID-19 హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలి. బెడ్ల అందుబాటును బట్టి ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటర్లు బెడ్ కేటాయిస్తున్నారు కాబట్టి నేరుగా ఆసుపత్రికి వెళ్లి సంప్రదించడం ఉత్తమం.

  --- డా. ముకేష్ మోహోడే & డా. శైలేష్ వాగ్లే – NGO భాగస్వామి యునైటెడ్ వే ముంబై
  Published by:Sridhar Reddy
  First published: