హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona to students : విద్యార్థులను భయపెడుతున్న కరోనా.. నల్గొండ స్కూళ్లో పాజిటివ్

Corona to students : విద్యార్థులను భయపెడుతున్న కరోనా.. నల్గొండ స్కూళ్లో పాజిటివ్

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, కిందటి రోజుతో పోల్చుకుంటే ఏకంగా 90 శాతం ఎక్కువ కేసులు వచ్చాయి. ముందురోజు 1,150గా ఉన్న కేసులు ఇప్పుడు రెండు వేల మార్కు దాటేశాయి. మరణాలు కూడా 200కు పైగా నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, కిందటి రోజుతో పోల్చుకుంటే ఏకంగా 90 శాతం ఎక్కువ కేసులు వచ్చాయి. ముందురోజు 1,150గా ఉన్న కేసులు ఇప్పుడు రెండు వేల మార్కు దాటేశాయి. మరణాలు కూడా 200కు పైగా నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Corona to students : నల్గొండ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.. రెండు రోజుల తేడాలోనే 20 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అటు విద్యార్థులు ఇటు తల్లితండ్రుల్లో ఆందోళన కొనసాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరోసారి విలయతాండవం సృష్టించడానికి సిద్ధమవుతోంది.రాష్ట్రంలో ఓ వైపు కరోనా తగ్గుతుందన్నట్టు కనిపిస్తున్నా.. తాజాగా నల్గొండలోని ఓ స్కూళ్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.. ఈ క్రమంలోనే.. నల్గోండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్టీ బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు కరోనా పాజిటీవ్ లక్షణాలు బయటపడ్డాయి. నిన్న15 మంది విద్యార్థినిలకు కరోనా సోకడంతో అప్రమత్తమైన అధికార యత్రాంగం పరీక్షలు చేపట్టింది. దీంతో.. నేడు ఎనిమిది మంది విద్యార్థినిలకు కరోనా సోకినట్టు నిర్థారణ అయింది.

స్కూళ్లో కరోనా పరీక్షలు

నల్గొండ జిల్లాలో విద్యార్థులకు కరోనా సోకుతున్న తరుణంలో.. కొండమల్లేపల్లి ఎస్టీ బాలికల పాఠశాలలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 423 మందికి పరీక్షలు చేయగా.. అందులో ఇవాళ ఏడుగురికి కరోనా పాజిటివ్(Students tested covid positive)​గా నిర్ధారణ అయింది. బుధవారం రోజున ఎనిమిది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.

విద్యార్థుల్లో ఆందోళన

ఇప్పుడిప్పుడే తాము స్కూళ్లకు హాజరవుతున్న క్రమంలో.. కరోనా సోకడం విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. ఈ ఏడాది కూడా తాము ఇళ్లలోనే ఉండి చదవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆన్​లైన్ తరగతుల్లో సరిగ్గా అర్థంగాక పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నామని వాపోతున్నారు. బడుల్లో ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. తాము ఎంత అప్రమత్తంగా ఉన్నా మహమ్మారి సోకుతోందని ఆవేదన చెందుతున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన..

మరోవైపు.. తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్న పిల్లలు మళ్లీ ఇంట్లోనే చదువుకోవాల్సిన దుస్థితి వస్తుందేమోనని ఆందోళన పడుతున్నారు. పాఠశాలల యాజమాన్యం కరోనా నిబంధనలు పాటిస్తున్నా.. పిల్లలు అప్రమత్తంగా ఉన్నా.. మహమ్మారి ఎక్కణ్నుంచి వస్తుందో అర్థంకావడం లేదని వాపోతున్నారు. మూడో దశ వచ్చేసిందేమోనని భయపడుతున్నారు.

తాజా కేసులు

కరోనాకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేయగా... తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,72,650కు చేరింది. తాజాగా 168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 6,64,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 3,967కు చేరింది.

First published:

Tags: Corona cases, Nalgonda

ఉత్తమ కథలు