CORONA POSITIVE PERSON OUTBREAK AT WORK 7 DIED AND 300 QUARANTINED IN USA SRD
Corona : లక్షణాలు లేవని ఆఫీస్ కు వెళ్లిన కరోనా రోగి.. ఏడుగురి మృతి, 300 మంది క్వారంటైన్..
ప్రతీకాత్మక చిత్రం
Corona : అణువంత క్రిమి అగ్రరాజ్యం అమెరికాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వేవ్ దెబ్బకి అగ్రరాజ్యం అతలాకుతలం అయింది. ఇప్పుడు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఆందోళనకు గురి చేస్తుండగా.. ఆ దేశంలోని దక్షిణ ఒరెగాన్ రాష్ట్రంలో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది.
అణువంత క్రిమి అగ్రరాజ్యం అమెరికాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వేవ్ దెబ్బకి అగ్రరాజ్యం అతలాకుతలం అయింది. ఇప్పుడు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఆందోళనకు గురి చేస్తుండగా.. ఆ దేశంలోని దక్షిణ ఒరెగాన్ రాష్ట్రంలో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని దక్షిణ ఓరేగాన్లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి డ్యూటీకి వెళ్లిన కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది భయంతో క్వారంటైన్‌కు వెళ్లారు. డగ్లస్ కౌంటీ అధికారుల కథనం ప్రకారం.. గత వారం ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ విధులకు వెళ్లాడు. ఆ తర్వాత అతడికి నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కౌంటీలో ఇటీవల రెండుసార్లు కేసులు భయపెట్టాయి. అందులో ఒకదాని కారణంగా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో దాని కారణంగా 300 మంది (కుటుంబాలు) స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు డగ్లస్ కౌంటీ పబ్లిక్ హెల్త్ అధికారి బాబ్ డానెన్హోఫెర్ పేర్కొన్నారు.
ఇప్పుడు వీరంతా తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నారని, వారిపై సానుభూతి కలుగుతోందని అన్నారు. అయితే, స్వీయ నిర్బంధంలోకి వెళ్లినవారి పేర్లు కానీ, వైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తి గురించి కానీ అధికారులు ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఓరేగాన్ తీరాన్ని ఆనుకుని ఉండే డగ్లస్ కౌంటీలో కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత ఇప్పటి వరకు 37 మంది మరణించారు. 1,315 కేసులు నమోదయ్యాయి. ఇక, ఓరేగాన్లో ఇప్పటి వరకు 1,347 మంది కరోనా కారణంగా మరణించగా, 1,03,755 కేసులు వెలుగుచూశాయి.
నవంబరు, డిసెంబరు నెలల్లో రోజువారీ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డగ్లస్ కౌంటీతోపాటు మరో 28, దాని అధికారపరిధిని ‘తీవ్ర ముప్పు’ ఉన్న ప్రాంతాలుగా రాష్ట్రం ప్రకటించింది. అయితే అమెరికాలో కరోనా రిస్క్ ఎక్కువున్న రాష్ట్రాల్లో ఒరెగాన్ ఒకటి. ఇక్కడ వచ్చే ఏడాది మార్చి 3 వరకు ‘‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’’ విధిస్తూ గవర్నర్ కెటె బ్రౌన్ ఇటీవల ఆర్డర్ ఇచ్చారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.