Home /News /coronavirus-latest-news /

CORONA POSITIVE PATIENTS FROM OTHER STATES COMING TO TELANGANA BECOMES A BURDEN MINISTER HARISH RAO SAYS TO CENTRAL MINISTER HARSHAVARDHA RAO AK

Telangana: కరోనా లెక్కల్లో అందుకే తేడాలు.. కేంద్రమంత్రికి వివరించిన హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

మంత్రి హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు ఆక్సీజన్ ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి హరీశ్ రావు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కోరారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సీన్లు ఆక్సీజన్ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు.

    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ పీవర్ సర్వేను నిర్వహిస్తున్నదని వివరించారు. అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదన్నారు. రాష్ట్రంలో నేటినుంచి లాక్ డౌన్ అమలవుతున్నదని కేంద్రమంత్రికి తెలిపారు. తెలంగాణలోని స్థానిక కరోనా రోగులకు అధనంగా ఇతర రాష్ట్రాలనుంచి కరోనా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందని అన్నారు. తెలంగాణ చుట్టుపక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలనుంచి కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణ కు వచ్చి ట్రీట్ మెంటు పొందుతున్నారని తెలిపారు.

    వారి వారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా లెక్కింప బడి రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తోందని తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని అన్నారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు ఆక్సీజన్ ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్‌ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు.

    రెండో డోస్ కొవిడ్ టీకాను నూటికి నూరుశాతం రాష్ట్రంలో అమలుపరుస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్ కోసం 96 లక్షల వాక్సిన్లు, సెకండ్ డోస్ పూర్తిచేయడం కోసం 33 లక్షల వ్యాక్సీన్లు మొత్తం 1 కోటీ 29 లక్షల వ్యాక్సీన్ల అవసరం వున్నదని తెలిపారు. ఈనెల చివరి వరకు గాను 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సీన్లు 3 లక్షల కోవాక్సిన్ వ్యాక్సీన్లు మొత్తం 13 లక్షల వ్యాక్సీన్లు తక్షణావసరమున్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Harish Rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు