ముంబై నుంచి వచ్చిన వ‌ల‌స కూలీకి క‌రోనా పాజిటివ్.. ఎక్కడో తెలుసా...

ఈ రోజున న‌ల్ల‌వెల్లి గ్రామంలో గంగాకిష‌న్ కుటుంబ సభ్యుల‌ను హోం క్వారెంటేన్ లో ఉంచారు..

news18-telugu
Updated: May 22, 2020, 1:16 PM IST
ముంబై నుంచి వచ్చిన వ‌ల‌స కూలీకి క‌రోనా పాజిటివ్.. ఎక్కడో తెలుసా...
ఉపాధి కోసం ముంబై వెళ్లి తిరిగి వచ్చిన వలస కూలీకి కరోనా పాసిటివ్
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో సుమారు 20 రోజుల త‌రువాత‌ పాజిటివ్ కేసు నమోదైంది.. ఉపాధి కోసం ముంబై వెళ్లి తిరిగి వచ్చిన వలస కూలీకి కరోనా పాసిటివ్ రావడంతో గ్రామస్తులు ఆందోళ‌న చెందుతున్నారు.. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన గంగ కిషన్ (58) గత కొంత కాలంగా ముంబై లో ఉంటున్నాడు.. 10 రోజుల క్రితం ముంబై నుండి స్వ‌గ్రామానికి తిరిగి వ‌చ్చాడు.. గంగాకిష‌న్ కు ముత్రం ఆగిపోయింది.. దీంతో జిల్లా ప్ర‌భుత్వ ఆసుత్రికి తీసుకు వెల్లారు.. ఆసుప‌త్రిలో బ్లడ్ శాంపిల్ తీసుకోని కోవిడ్19 టెస్టు చేయాగా గురువారం గంగాకిష‌న్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.. దీంతో అత‌న్ని హైద‌రాబాద్ లోని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.. ఈ రోజున న‌ల్ల‌వెల్లి గ్రామంలో గంగాకిష‌న్ కుటుంబ సభ్యుల‌ను హోం క్వారెంటేన్ లో ఉంచారు.. గ్రామంలో రెవేన్యూ, ఆరోగ్య‌శాఖ సిబ్బంది వ‌చ్చి గ్రామంలో ప‌రిస్థితి ప‌రిశీలించారు.. గ్రామ విధుల్లో హైడ్రోక్టోరేఫాం పిచుకారి చేసారు.. గ్రామంలో క‌రోనా నివార‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌మ‌ని గ్రామ‌స‌ర్పంచ్ ల‌క్ష్మ‌రెడ్డి తెలిపారు.. ప్ర‌జ‌లు ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నా‌మ‌ని అయ‌న చెప్పారు..
Published by: Venu Gopal
First published: May 22, 2020, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading