మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా.. ఆ ప్రాంతంలో హైఅలర్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళగిరి ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు.

  • Share this:
    ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్ధనలకు వెళ్లొచ్చిన మంగళగిరికి చెందిన ఓ వ్యక్తికి నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. బాధితుడు స్థానికంగా టిప్పర్ బజారులో నివాసముంటున్నాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించినట్టు మున్సిపల్ కమిషనర్ హేమమాలిని చెప్పారు. బాధితుడితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించారు. దీంతో మంగళగిరి ప్రాంతంలోని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ కేసు వెలుగులోకి రావడంతో ముందస్తు జాగ్రత్తగా కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసేశారు. 144 సెక్షన్ విధించి మంగళగిరి ప్రాంతాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు.
    Published by:Narsimha Badhini
    First published: