Uttarakhand: కరోనా మళ్లీ పంజా విసురుతోంది. నిదానంగా అన్నీ రాష్ట్రాలు కరోనా బారినపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ నవోదయ స్కూల్లో 85మంది స్టూడెంట్స్‌కి మహమ్మారి సోకింది. పాజిటివ్ వచ్చిన వాళ్లను పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచారు. వారికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. స్కూల్‌ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
కరోనా విజృంభణ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. అక్కడ..ఇక్కడ అనే తేడా లేకుండా చాలా రాష్ట్రాలపై కరోనా పడగ బుసలు కొడుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్(Nainital)లో ఓ స్కూల్లో చదువుతున్న 85మంది విద్యార్ధులు వైరస్ (Virus)బారినపడ్డారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఆన్లైన్ పాఠాలతో విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. మరికొన్నిచోట్ల పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తున్నప్పటికి కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరోనా విరుచుకుపడటంతో ఎక్కువగా స్కూల్ విద్యార్ధులే బాధితులవుతారని ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైనిటాల్లో కొత్తగా నమోదైన ఈ పాజిటివ్ కేసుల(Positive cases)తో మిగిలిన పాఠశాలల్లో (Schools)చదువుతున్న విద్యార్ధులు (Students)ఆందోళన చెందుతున్నారు. నైనిటాల్(Nainital)లోని నవోదయ విద్యాలయం(Navodaya schoolలో మొదట 11మంది విద్యార్దులు మహమ్మారి బారినపడ్డారు. అప్రమత్తమైన స్కూల్ టీచర్లు,(Teachers) విద్యాశాఖ అధికారులు స్కూల్లోని మిగిలిన వాళ్లందరికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు.
స్కూల్ పిల్లలపై కరోనా ప్రభావం..
పాఠశాలలో మొత్తం 496మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు అధికారులు. అందులో మరో 74మందికి పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. పాఠశాలలో విద్యార్ధులు కరోనా బారిన పడటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూల్ మూసివేశారు. వైరస్ బారిన పడిన విద్యార్ధులను అందులోనే ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. వారికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. స్కూల్‌ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరోవైపు కరోనా బారిన పడిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నైనిటాల్లో 85మంది విద్యార్దులకు పాజిటివ్ ..
గత నెల 30న స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు మరో 8మంది విద్యార్దులకు కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. దాంతో అప్రమత్తమైన అధికారులు 488మంది విద్యార్దుల శాంపిళ్లను సేకరించారు. అందులో మరికొందరి రిపోర్ట్లు రావాల్సి ఉంది. నైనిటాల్‌లోని నవోదయ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్‌లో చాలా మంది దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. కరోనాతో పాటు ఉత్తరాఖండ్‌లో ఒమిక్రాన్ కేసులు సైతం భయపెడుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8కి చేరింది.
దక్షిణాదిలోనూ కరోనా పేరు చెబితే దడే ..
మరోవైపు తమిళనాడులోనూ కరోనా ప్రభావం ప్రమాదకరంగా మారింది. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 70కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం భయానక పరిస్థితి నెలకొంది. ఒకే రోజు అన్ని కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా ఫస్ట్ క్లాస్ నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించింది స్టాలిన్ సర్కారు. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి 30 వరకు కఠినంగా అమలు చేయాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు కూడా సిద్దమైంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.