ఇండియాలో అత్యంత తీవ్రంగా కరోనా... ఒక్కరోజులో 5 వందలకు పైగా మరణాలు...

భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగానే దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ... మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.

news18-telugu
Updated: July 1, 2020, 9:58 AM IST
ఇండియాలో అత్యంత తీవ్రంగా కరోనా... ఒక్కరోజులో 5 వందలకు పైగా మరణాలు...
ఇండియాలో తీవ్రంగా కరోనా... 6 లక్షలకు చేరువలో కేసులు... (credit - NIAID)
  • Share this:
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 18653 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 585493కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో ఏకంగా 507 మరణాలు సంభవించడంతో... మొత్తం మరణాల సంఖ్య 17400 అయ్యింది. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 3 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇది 8 శాతంగా ఉంది.

తాజా లెక్కల ప్రకారం... నిన్న 13157 మంది కరోనా నుంచి కోలుకోవడంతో... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 347978కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 220114గా ఉంది. ఇండియాలో రికవరీ రేటు అంతకంతకూ పెరుగుతూ... తాజాగా అది 59.4 శాతానికి చేరింది. రికవరీ ఎంత పెరిగితే... దేశంలో కరోనా అంతగా కంట్రోల్ అవుతున్నట్లు లెక్క. కాకపోతే మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరమే.

దేశంలో గత 24 గంటల్లో 217931 మందికి టెస్టులు చెయ్యడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 8826585కి పెరిగింది.

ఇదే అంశంపై దేశ ప్రజలను ఉద్దేశించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ ప్రజలు ఇదివరకటి కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చితే... భారత్... కరోనా మరణాల్ని తగ్గించడంలో చాలా సమర్థంగా పనిచేసిందన్న ఆయన... ఇకపైనా అన్ని జాగ్రత్తలూ పాటించడం ద్వారా... కరోనాను నిలువరించగలం అని పిలుపిచ్చారు.

దేశంలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
First published: July 1, 2020, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading