గాంధీ ఆస్పత్రి వైద్యుడిపై కరోనా మృతుడి బంధువుల దాడి..

గాంధీ ఆస్పత్రి వైద్యులపై దాడి

వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. ఇనుప కుర్చీలతో జూనియర్‌ వైద్యుడిపై దాడి చేశారు. మృతుడి బంధువల దాడిలో డాక్టర్ స్వల్పంగా గాయపడ్డాడు.

 • Share this:
  కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. తాజాగా
  సికింద్రాబాద్‌‌లోని గాంధీ ఆస్పత్రిలో మరోసారి డాక్టర్లపై దాడి ఘటన జరిగింది. ఓ జూనియర్‌ వైద్యుడిపై కరోనా రోగి బంధువులు దాడి చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ ఇవాళ ఓ రోగి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. ఇనుప కుర్చీలతో జూనియర్‌ వైద్యుడిపై దాడి చేశారు. మృతుడి బంధువల దాడిలో డాక్టర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనను గాంధీ ఆస్పత్రిలోని డాక్టర్లు ఖండించారు. ఘటను నిరసిస్తూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ప్రాణాలకుతెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న తమపై దాడులు జరుగుతున్నాయని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

  కాగా, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3920కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1742 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2030 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 148కి చేరింది.
  Published by:Shiva Kumar Addula
  First published: