ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో దేశం ఒమిక్రాన్ బారిన పడి లాక్డౌన్ (Lockdown) వైపు అడుగులు వేస్తోంది. ఆస్ట్రియా, డెన్మా ర్క్ తదితర దేశాలు ఇప్ప టికే కఠిన నిబం ధనలను మళ్లీ ప్రవేశపెట్టాయి. కేసుల పెరుగుదల దెబ్బకు నెదర్లాండ్స్ (Netherlands) తాజాగా దేశం లో క్రిస్మస్ లాక్డౌన్ ప్రకటించింది. దేశంలో కేసుల తీవ్రత వేగంగా పెరుగుతుండడంతో జనవరి 14 వరకూ అన్ని సాంస్కృతిక, వినోద కేంద్రాలు, కొన్ని దుకాణాలు మూసి ఉంటాయని ప్రధాని మార్క్ రుట్టే వెల్లడించారు. జనవరి 9 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. క్రిస్మస్ రోజు మినహా.. మిగతా రోజుల్లో అతిథుల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నెదర్లాండ్స్ ఆదివారం నుంచి మళ్లీ లాక్డౌన్లోకి వెళ్తోంది, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రధాని రుట్టే అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 89 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డెల్టా వేరియంట్ (Delta Variant) కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉండటంతో..
Majestic Standing Stones: ఈ రాళ్లకు ప్రత్యేకత ఉంది.. ప్రపంచంలో వింతైన ప్రదేశాలు ఇవే!
స్థానికంగా రెండు వారాల లాక్డౌన్ విధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. లండన్ (London) లో అత్య వసర పరిస్థితి లాంటిది నెలకొందని మేయర్ ప్రకటించారు.
మూడు రోజుల వ్యవధిలోనే వ్యాప్తి ఉధృతంగా ఉందన్నారు. కాగా, రోగ నిరోధక శక్తిపై ఒమిక్రాన్ వేరియంట్ ఏమేరకు ప్రభావం చూపుతుందనేదానిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒమిక్రాన్ తీవ్రతపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ (WHO) పేర్కొంది.
ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఫ్రాన్స్ తదితర దేశాలు యూకే నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి. జర్మనీ సైతం బ్రిటన్ను హై- రిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. అక్క డి నుం చి వచ్చే ప్రయాణికులు ఆదివారం నుంచి కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపాలని, రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని ఏడు దేశాల ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం (Physical Distance) పాటించడంతోనే దీన్ని అడ్డుకోవచ్చునని డబ్ల్యూహెచ్వో ఈశాన్య ఆసియా డైరెక్టర్ పూనం ఖేత్రపాల్సింగ్ చెప్పారు. వైరస్ రిస్క్ ఎక్కువగా ఉన్న వారిని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Omicron, Omicron corona variant, World Health Organisation