దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. జూన్ 16, 17 తేదీల్లో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల సీఎంలతో కరోనా వైరస్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. 16న కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ.. 17న కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తారు. జూన్ 17న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలతో మోదీ మాట్లాడనున్నారు.
జూన్ 16న పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లద్ధాఖ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, లక్షద్వీప్, సిక్కిం, అరుణాలచ్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడతారు.
ఇక జూన్ 17న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, ఏపీ, తెలంగాణ, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు.
PM @narendramodi will interact with state Chief Ministers on the 16th and 17th. pic.twitter.com/RWGeanxgHd
— PMO India (@PMOIndia) June 12, 2020
కరోనా కట్టడి, అన్‌లాక్ 1పై ముఖ్యమంత్రుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. అంతేకాదు మరోసారి లాక్‌డౌన్‌కు వెళ్లాలా? లేదంటే జూన్ 30తో ఉన్న లాక్‌డౌన్‌ను ముగించాలా? అన్న దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. సీఎంలతో ఇప్పటికే ఐదు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఇది ఆరోసారి.
Prime Minister Narendra Modi to interact with Chief Ministers of all states and union territories on 16 and 17th June. (file pic) pic.twitter.com/ZRJ0qSCfDQ
— ANI (@ANI) June 12, 2020
కాగా, మన దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ప్రపంచంలో కరోనా తీవ్ర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో పరిస్థితి దారుణంగా ఉంది. వైరస్ సంక్రమణ పతాక స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన నెలకొంది. మరోసారి లాక్‌డౌన్ విధిస్తే బాగుంటుందని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంలతో సమావేశంలో మోదీ ఏం చెప్పనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Lockdown, Lockdown relaxations