Covid 19: కరోనా నుంచి రక్షణ కోసం కొత్త పాలసీలొచ్చాయి... ప్రీమియం ఎంతంటే

Covid 19: కరోనా నుంచి రక్షణ కోసం పాలసీలొచ్చాయి... ప్రీమియం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Corona Rakshak and Corona Kavach policy | కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు రెండు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలతో వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.

  • Share this:
    కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలు వచ్చేశాయి. సాధారణంగా ఉండే హెల్త్ పాలసీల కన్నా ఈ పాలసీల ప్రీమియం చాలా తక్కువగా ఉంది. రూ.5 లక్షల కవరేజీ ఇచ్చే కరోనా కవచ్ పాలసీ ప్రీమియం రూ.636 నుంచి మొదలైతే, రూ.2.5 లక్షల కవరేజీ ఇచ్చే కరోనా రక్షక్ పాలసీ ప్రీమియం రూ.510 నుంచి మొదలవుతుంది. అయితే పాలసీ గడువు, పాలసీదారుల వయస్సును బట్టి ప్రీమియం మారుతుంది. అన్ని జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కరోనా కవచ్, కరోనా రక్షక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. ఇది కేవలం కోవిడ్ 19 చికిత్స కోసం మాత్రమే ఉపయోగపడే పాలసీ.

    'కరోనా కవచ్' పాలసీ తీసుకున్నవారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా పాలసీలో కవర్ అవుతుంది. పాలసీ టెన్యూర్ 3.5 నెలల నుంచి 9.5 నెలల వరకు ఉంటుంది. పాలసీదారులు ఎంతమొత్తంలో బీమా తీసుకుంటే ఆస్పత్రి ఖర్చులో అంతవరకు రీ-ఇంబర్స్ చేసుకోవచ్చు. ఆస్పత్రి ఖర్చులతో పాటు పీపీఈ కిట్స్, గ్లోవ్స్, మాస్కులు, ఆయుష్ ట్రీట్మెంట్ కూడా ఇందులో కవర్ అవుతుంది. పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ సిలిండర్, నెబ్యులైజర్లు కూడా కవర్ అవుతాయి. 14 రోజుల వరకు హోమ్ కేర్ ట్రీట్మెంట్ కూడా కవర్ అవుతుంది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు 'కరోనా కవచ్' పాలసీ తీసుకోవచ్చు. హెల్త్ కేర్ వర్కర్స్‌కి 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఈ పాలసీలో మాత్రమే ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ ఉంటుంది. 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి. అంటే వెయిటింగ్ పీరియడ్‌లో క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఏఏ కంపెనీ ఎంత ప్రీమియం నిర్ణయించిందో తెలుసుకోవడానికి ఈ చార్ట్ చూడండి.

    Paytm: డబ్బులు లేకపోయినా షాపింగ్... పేటీఎం ఆఫర్

    SBI: ఈ బ్యాంకింగ్ సేవలకు మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్ చాలు

    IRDAI Corona Rakshak policy, IRDAI Corona Kavach policy, IRDAI Coronavirus policy, Coronavirus health insurance policy, COVID-19 health insurance policy, ఐఆర్‌డీఏఐ కరోనా రక్షక్ పాలసీ, ఐఆర్‌డీఏఐ కరోనా కవచ్ పాలసీ, ఐఆర్‌డీఏఐ కరోనా వైరస్ పాలసీ, కరోనా వైరస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, కోవిడ్ 19 హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ
    Source: Moneycontrol


    కరోనా రక్షక్ సింగిల్ ప్రీమియం ప్లాన్. కోవిడ్ 19 పాజిటీవ్ అని తేలిన తర్వాత 72 గంటల్లో ఆస్పత్రి పాలైతే 100 శాతం క్లెయిమ్ చేసుకోవచ్చు. 105 రోజులు, 195 రోజులు, 285 రోజుల వరకు పాలసీ తీసుకోవచ్చు. కరోనా రక్షక్ పాలసీని కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.2,50,000 వరకు తీసుకోవచ్చు. ఒక్కసారి క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాలసీ పనిచేయదు. కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 65 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు ఈ రెండు పాలసీలు తీసుకోవచ్చు. 3 నెలల నుంచి 25 ఏళ్ల లోపు డిపెండెంట్ చిల్డ్రన్ కూడా ఇందులో కవర్ అవుతారు. ఇందులోనూ 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి. ఈ పాలసీ ప్రీమియం కోసం కింద చార్ట్ చూడండి.

    SBI Gold Loan: గోల్డ్ లోన్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకోవచ్చు... ఎలాగంటే

    కరోనా కష్టకాలంలో అప్పులు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

    IRDAI Corona Rakshak policy, IRDAI Corona Kavach policy, IRDAI Coronavirus policy, Coronavirus health insurance policy, COVID-19 health insurance policy, ఐఆర్‌డీఏఐ కరోనా రక్షక్ పాలసీ, ఐఆర్‌డీఏఐ కరోనా కవచ్ పాలసీ, ఐఆర్‌డీఏఐ కరోనా వైరస్ పాలసీ, కరోనా వైరస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, కోవిడ్ 19 హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ
    Source: Moneycontrol


    ఐఆర్‌డీఏఐ స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ అయిన ఆరోగ్య సంజీవని ప్రీమియం కన్నా కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల ప్రీమియం తక్కువ. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల కరోనా కవచ్ పాలసీని 3.5 నెలలకు తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.636 నుంచి రూ.3,831 మధ్య ఉంటుంది. ఒకవేళ 9.5 నెలలకు తీసుకుంటే రూ.1,286 నుంచి రూ.5,172 మధ్య ప్రీమియం ఉంటుంది.

    (ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)
    Published by:Santhosh Kumar S
    First published: