Corona India | ఒక్క రోజే 5 వేలు దాటిన కరోనా కేసులు.. 157 మంది మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో ఒక్క రోజులోనే కరోనా కేసుల సంఖ్య 5వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో 5,242 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  • Share this:
    ఇండియాలో ఒక్క రోజులోనే కరోనా కేసుల సంఖ్య 5వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో 5,242 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 96,169 కు చేరుకుంది. నిన్న మరో 157 మంది వ్యాధి బారిన పడి మరణించారు. మొత్తంగా చనిపోయిన వారి సంఖ్య 3029 కు చేరింది. ప్రస్తుతం 56,317 యాక్టివ్ కేసులు ఉండగా, 36,823 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 33,053 మందికి వైరస్ సోకగా, 1198 మంది చనిపోయారు. ఆ తర్వాత గుజరాత్ 11379, తమిళనాడు 11224, ఢిల్లీ 10054, రాజస్థాన్ 5202, మధ్యప్రదేశ్ 4977, ఉత్తరప్రదేశ్ 4259, పశ్చిమ బెంగాల్ 2677, ఏపీ 2407, పంజాబ్ 1964, తెలంగాణ 1551, బిహార్ 1262, జమ్మూ కశ్మీర్ 1183, కర్ణాటక 1147, హరియాణా 910, ఒడిసా 828, కేరళ 601, జార్ఖండ్ 223, ఛండీగఢ్ 191, త్రిపుర 167, అసోం 101, ఉత్తరాఖండ్ 92, ఛత్తీస్‌గఢ్ 86, హిమాచల్ ప్రదేశ్ 80, లడఖ్ 43, అండమాన్ నికోబార్ దీవులు 33, గోవా 29, మేఘాలయా 13, పుదుచ్చేరి 13, మణిపూర్ 7, అరుణాచల్ ప్రదేశ్ 1, దాద్రా నగర్ హవేలీ 1, మిజోరం 1 కేసులు నమోదయ్యాయి.

    కరోనా వైరస్ కేసుల వివరాలు
    Published by:Shravan Kumar Bommakanti
    First published: