కరోనాతో దేశంలో తగ్గిపోయిన వంటనూనెల డిమాండ్...

దశాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతగా మన దేశంలో వంటనూనెకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పామ్‌ అయిల్, సోయా ఆయిల్‌లు డిమాండ్‌ గత ఏడాది పోలిస్తే 23 మిలియన్‌ టన్నులు తగ్గింది.

news18-telugu
Updated: March 31, 2020, 11:55 PM IST
కరోనాతో దేశంలో తగ్గిపోయిన వంటనూనెల డిమాండ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా దెబ్బతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడడంతో వంటనూనెలకు డిమాండ్‌ బాగా పడిపోయింది. దశాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతగా మన దేశంలో వంటనూనెకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పామ్‌ అయిల్, సోయా ఆయిల్‌లు డిమాండ్‌ గత ఏడాది పోలిస్తే 23 మిలియన్‌ టన్నులు తగ్గింది. లాక్‌డౌన్‌ కాలంలో 475,000 టన్నుల వంటనూనె డిమాండ్‌ పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు సన్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ సందీ బజోరియా అన్నారు. నెలకు 1.9 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ను సగటున వినియోగిస్తారని, రెస్టారెంట్లలో ఎక్కువగా పామ్‌ ఆయిల్‌ వాడతారని తెలిపారు. పామ్‌అయిల్‌ ఉత్పత్తి చేసే మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు సైతం ఇండియాలో డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తిని తగ్గించేశాయి.
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading