Corona Effect: తల్లికి ఆన్ లైన్ కర్మకాండ. ఓ కొడుకుది అమెరికా, మరో కొడుకుది బెంగళూర్

ఆన్ లైన్ కర్మకాండ

ఆన్ లైన్.. ఇఫ్పుడు అన్నింటికీ అదే ఆదారమైంది. కరోనా పంజాతో ఆన్ లైన్ వినియోగం తప్పని సరి అయ్యింది. అయితే ఇప్పుడు పెళ్లిళ్లు సైతం ఆన్ లైన్ లో ట్రెండింగ్ గా మారాయి. తాజాగా భీమవరంలో ఓ తల్లికి కొడుకులు ఆన్ లైన్ ద్వారా కర్మకాండ నిర్వహించడం వైరల్ గా మారింది.

 • Share this:
  దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. భారత్ లో ప్రతి రోజూ మూడు లక్షలకుపైగానే కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలపై కరోనా ప్రభావం దారుణంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలు అవుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూతో సహా పలు  ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సెకెండ్ వేవ్ దేశంపై విరుచుకుపడుతోంది. భారీ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్ కు ప్రయాణికులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. బెంగళూర్ లాంటి మహానగరాల్లో పరిస్థితి దారుణంగా ఉండడంతో అక్కడ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  మరోవైపు కరోనా కారణంగా భయంతో చాలా చోట్ల అమానుష ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎవరైనా కరోనా బారిన పడి చనిపోతే. వారి అంత్యక్రియలు జరిపేందుకు సొంత కుటుంబ సభ్యులే ముందుకు రావడం లేదు. ఇక బంధువులు ఆ ఇంటి వైపు వెళ్లడమే పాపమని భయపడుతున్నారు.  కరోనాతో రోడ్డుపై ఎవరైనా పడి ఉన్నా వారిని పట్టించుకునే నాథుడు కరువు అవుతున్నాడు. కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. వారిని అంటరాని వారిగా పరిగణిస్తున్నారు. కష్టాల్లో ఉన్న సాయం మాట అటుంచితే.. వారికి నష్టం కలిగించే వారే ఎక్కువ అవుతున్నారు. ఇక ఆస్పత్రుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా అంటూ ఎవరైనా వస్తే వారి రక్తాన్ని పీల్చేస్తున్నాయి ఆస్పత్రులు.. అంతేకాదు కరోనా కొత్త కొత్త పద్ధతులు నేర్పుతోంది.

  ఇదీ చదవిండి: చనిపోయిన మృతదేహానికి పరీక్షలు. తరువాత ఏం జరిగిందో తెలుసా? ఛీ ఇంత కక్కుర్తా

  కరోనా కారణంగా తల్లిదండ్రులు, కన్నవారికి కర్మకాండలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఓ ఇద్దరు కొడుకులు.. తన తల్లికి ఆన్ లైన్ లో కర్మకాండ నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. భీమవరంలో  ఈ ఆన్ లైన్ కర్మకాండలు జరిగాయి. పద్మావతికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త, ఒక కుమారుడు బెంగళూరు, మరో కుమారుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల పద్మావతి మరణించారు. దీంతో  తల్లి 11వ రోజు కార్యక్రమాన్ని అమెరికా, బెంగళూరులో ఉన్న కుమారులు ఆన్లైన్ లో నిర్వహించారు.  బెంగళూరులో కర్మకాండలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో భీమవరం నుంచి ఆన్లైన్ లోనే కర్మకాండలు చేసారు. పురోహితులు సూచించిన విధంగా సంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.   

  ఇదీ చదవిండి: ఏపీలో మోగుతున్న పెళ్లి బాజా.. కానీ అనుమతి తప్పని సరి? ఏంటా కండిషన్లు

  ఇఫ్పటికే ఆన్ లైన్ ప్రపంచం పెరిగిపోయింది. ప్రతి పనికీ అందరూ  ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా ఆన్ లైన్ తొలి ఆప్షన్ అయ్యింది. కరోనా కారణంగా ఆ వినియోగం ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు పెళ్లిళ్లు కూడా ఆన్ లైన్ లో నిర్వహించడం ట్రెండ్ అవుతోంది. తాజాగా కర్మకాండలు సైతం  ఆన్ లైన్ లో నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది.
  Published by:Nagesh Paina
  First published: