కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు ప్రధాని మోదీ మరో నిర్ణయం..?

దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేసేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

news18-telugu
Updated: March 26, 2020, 8:00 AM IST
కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు ప్రధాని మోదీ మరో నిర్ణయం..?
ప్రధాని మోదీ
  • Share this:
Corona Effect : దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేసేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న జనసాంద్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటు ప్రదర్శించినా ఘోర ప్రమాదం జరుగుతుందని చెబుతున్నారు. అందుకే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు దాటి బయటికి వస్తే పోలీసులు చితకబాదుతున్నారు. అయినా.. 21 రోజుల లాక్‌డౌన్ భారత్‌లో సరిపోదని.. మరిన్ని రోజులు లాక్‌డౌన్ విధిస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారులు. 21 రోజుల లాక్‌ డౌన్‌ సరిపోదని, ఏప్రిల్‌ 15 త ర్వాత మరిన్ని రోజులు లాక్‌డౌన్‌ ను పొడిగించే అవకాశాలు లేకపోలేదని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా, ఇటలీల్లో జరుగుతున్న దుష్పరిణామాలు భారత్‌లో జరగకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

వైరస్‌ మరింత విజృంభిస్తే అందరికీ చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేవని, పరిస్థితులు అదుపు తప్పితే నియంత్రణ సాధ్యం కాదని వివరించారు. మన దేశంలో వెద్యుల సంఖ్య కూడా తక్కువేనని, ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి సరిపడా వైద్యులు లేరని ఆయన అన్నారు. అందుకే.. మన దేశం సరైన సమయంలోనే రంగంలోకి దిగిందని చెప్పారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు