CORONA EFFECT IN TIRUPATI THE MOTHER WHO BECAME AN ORPHAN NO MATTER THE SON NGS TPT
Andhra Pradesh: అమ్మా.. నీవెక్కడ... ఓ కొడుకు కన్నీటి వ్యధ. కన్నీరు పెట్టించిన కరోనా కథ
ప్రేమించే కొడుకు ఉన్నా అనాథ శవంగా మారిన అమ్మ
కుటుంబాల్లో విషాదం నింపుతోంది కరోనా మహమ్మారి.. అందరూ ఉన్నా అనాథలుగా మారుస్తోంది. ఓ అమ్మకోసం పది రోజుల పాటు ఎదురు చూసిన కొడుకు.. తరువాత జరిగిన విషయం తెలిసి కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది.
కరోనా మహమ్మారి బంధాలు, బాంధవ్యాలను దూరం చేేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలకు పాజిటివ్ నిర్ధారణ అయ్యి.. వేర్వేరు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయితే వారితో పాటు పిల్లలకు నరక యాతన తప్పడం లేదు. అసలు ఒక హాస్పిటల్ లో ఉన్న భర్త బ్రతికే ఉన్నడా లేదా అనే విషయం ఇంకొక ఆసుపత్రిలో ఉన్న భార్యకు తెలియదు.. మొబైల్ ఫోన్ ఉండి.. వారు మాట్లాడగలిగే స్థితిలో ఉంటే ఒకే.. పరిస్థితి కాస్త సీరియస్ గా ఉంటే.. అసలు సమాచారమే ఉండడంలేదు. ఇక మొబైల్స్ వాడటం లేదు అంటే వారు ఉన్నారా లేదా అనే సంగతి కూడా తమ వారికి తెలియడం లేదు. ఇలాంటి సంఘటనలు కరోనా విజృంభిస్తున్న సమయంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి.
విడతీయని పేగు బంధం తల్లి బిడ్డలది. తొమ్మిది నెలలు తన కడుపులో మోసి... పెంచి పెద్ద చేసిన అమ్మ అంటే ఎవరికైనా అమితమైన ప్రేమ., అభిమానం ఉంటుంది.అలాంటి తల్లి క్షేమ సమాచారం తెలియకుండా దూరంగా ఉండాలి అంటే ఏ బిడ్డకైనా కష్టమే.. తల్లి ఎలా ఉంది. ఆమెకు చికిత్స అందుతోందా లేదా.. ఆమెకు కష్ట వస్తే ఎవరైనా పట్టించుకుంటున్నారా లేద.. ఇలా ఆమె ఆలోచనలతో తీవ్ర మనస్థాపం తప్పదు...
తిరుపతిలోని కోరుగుంటలో నివాసం ఉంటున్న ఓ కొడుకుకీ అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆనందాలకు నెలవైన అందమైన చిన్న కుటుంభం. సురేంద్ర తన అమ్మ భార్య పిల్లలతో కలసి కొర్లగుంటలో నివాసం ఉంటున్నారు. సాఫీగా సాగుతున్న జీవితంలో కరోనా పిడుగులా మారి విషాదాన్ని నింపింది. కరోనా లక్షణాలు బయట పడటంతో 62 ఏళ్ల అమ్మ లక్షీదేవితో కలసి సురేంద్ర అతని భార్య కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ముగ్గురుకి కరోనా నిర్ధారణ కావడంతో మెడికల్ షాపులో దొరికే కరోనా కిట్లను కొనుగోలు చేసుకొని.. హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. అయితే మూడు నాలుగు రోజుల తరువాత ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముందుగా అమ్మను దక్కించుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్స్ కోసం ప్రయత్నించారు కానీ బెడ్లు కాళీ లేక పోవడంతో... పాత ప్రసూతి ఆసుపత్రిలో లక్ష్మీదేవిని అడ్మిట్ చేసారు. ఇంటికి వెళ్లి తాము ఏదైనా ఆసుపత్రికి వెళ్లాలని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్లకోసం ప్రయత్నం చేసారు ఆక్సిజన్ రహిత బెడ్లు రెండు దొరకడంతో అక్కడకు వెళ్లి అడ్మిట్ అయ్యారు. రెండు రోజుల్లో భార్యాభర్తలకు సుమారు 2 లక్షల రూపాయలు బిల్లు కాగా కట్టే స్తోమత లేక ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఇంటికి వచ్చిన నాటి నుంచి సురేంద్రకు అమ్మపైనే ద్యాస ఉండేది. లక్ష్మీదేవి వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో అమ్మ యోగ క్షేమాలు కనుకోలేక పోయాడు. 10 రోజుల పాటు ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి... భారంగా మరీనా దిగమింగుకుని ఇంట్లోనే గడిపాడు. ఈ నెల 29వ ఆరోగ్యం కుదుటపడగానే పాత ప్రసూతి ఆసుపత్రి వద్దకు పరుగులు పెట్టాడు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది నుంచి వార్డు బాయిస్ వరకు అందరిని అడిగాడు తన తల్లికి ఎలా ఉందో ఎక్కడ ఉందొ అని.. కానీ అక్కడ వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తమకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చారు. దింతో ఎం చేయాలో తెలియని సురేంద్రకు ఎవరిని ప్రాధేయ పడిన ప్రయోజనం లేకుండా పోయింది.
చివరకు వార్డు వాలంటీర్., సెక్టోరల్ అధికారి వద్ద వెళ్లి తల్లిపై తనకు ఉన్న ప్రేమను ఆవేదన రూపంలో వెళ్లగక్కాడు. దింతో స్పందించిన వారు ఈ నెల 19వ తేదీ లక్ష్మీదేవి మరణించినట్లుగా నిర్ధారించారు. అనాధ శవంగా భావించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసి ఉంటారని సురేంద్రకు తెలిపారు. అనాథ శవాలు దహనం చేసే మామండూరు అటవీ ప్రాంతానికి తన భార్యతో కలసి అమ్మకు నివాళులు అర్పించడానికి వెళ్ళాడు. అదే సమయంలో ముస్లిం కోవిడ్-19 జేఏసీ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 16 అనాధ దేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. చివరి ఆశగా ఈ 16 దేహాల్లో తన తల్లి దేహం ఉందొ లేదో చూసుకోమని సెక్టోరల్ అధికారి సురేంద్రను పిలిపించారు. తన తల్లి అనాధ శవలతో పాటు ఉన్న దృశ్యాన్ని చూసి సురేంద్ర బోరున విలపించాడు.
తనవళ్ళే తన తల్లికి ఇలాంటి గతిపట్టిందని కన్నీరుమున్నీరు అయ్యాడు. దింతో అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే భూమన, ముస్లిం కోవిడ్-19 జేఏసీ సభ్యులు సురేంద్రను ఓదార్చారు. తన చేతుల మీదుగా తన తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.