అద్భుతం... టీబీ టాబ్లెట్‌తో కరోనాకు చెక్... లోతుగా పరిశోధిస్తున్న డాక్టర్లు...

అద్భుతం... టీబీ టాబ్లెట్‌తో కరోనాకు చెక్... లోతుగా పరిశోధిస్తున్న డాక్టర్లు...

అద్భుతం... టీబీ టాబ్లెట్‌తో కరోనాకు చెక్... లోతుగా పరిశోధిస్తున్న డాక్టర్లు... (credit - NIAID)

కరోనాను నియంత్రించే మందుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనం కరోనాను జయించే దిశగా అడుగులు వేస్తున్నట్లే. తాజాగా ఆ టీబీ డ్రగ్స్ సంగతులు తెలుసుకుందాం.

 • Share this:
  ముంబైలో కరోనా ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. అలాంటి చోట... M-ఈస్ట్ వార్డ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ... 5500 మంది టీబీ (క్షయ) పేషెంట్లు ఉన్నారు. వారిలో ఐదుగురికి మాత్రమే కరోనా సోకింది. అలాగే... అక్కడి సెవ్రీ టీబీ హాస్పిటల్‌లో 400 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉండగా... వారిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఐతే... అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న 53 మంది హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా సోకింది. వారిలో 17 మంది నర్సులు ఉన్నారు. మరి వాళ్లకు కరోనా సోకినప్పుడు... టీబీ పేషెంట్లకు ఎందుకు సోకట్లేదు? అనే డౌట్ వచ్చింది డాక్టర్లకు. మైండ్‌లో బల్బ్ వెలిగింది. టీబీ పేషెంట్లకు ఇస్తున్న టాబ్లెట్ల వల్లే కరోనా రావట్లేదని అర్థమైంది. అంటే... ఆ టాబ్లెట్లు కరోనాకు బ్రేక వేస్తున్నాయన్నమాట. వెంటనే నిపుణులు వెళ్లి... బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారుల్ని కలిశారు. విషయం చెప్పారు. అవునా అంటూ ఆశ్చర్యపోయిన అధికారులు... భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)కి విషయం చేరవేశారు.

  కరోనా వైరస్ లాగే... పల్మనరీ టీబీ కూడా ఊపిరితిత్తులపైనే దాడిచేస్తుంది. రెండు వ్యాధుల్లోనూ ప్రధాన లక్షణం దగ్గే. కంటిన్యూగా దగ్గుతూనే ఉంటారు. ఇక జ్వరం రావడం, ఊపిరి అందకపోవడం అనే లక్షణాలు కూడా రెండు వ్యాధులలోనూ ఉన్నాయి. ఐతే... టీబీ అనేది కరోనా అంత వేగంగా ఉండదు. అది సోకిన వారు రెండు మూడేళ్ల దాకా బాధపడుతూనే ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న టీబీ పేషెంట్లందరూ... కరోనా సోకకుండా ఉండగలుగుతున్నారా అనేది తేలాల్సి ఉంది.

  ముంబైలోని టీబీ పేషెంట్లలో ఎక్కువ మంది మురికి వాడలైన మాన్ఖుర్డ్, గోవండీ నుంచి వచ్చినవారే. కరోనా వచ్చిన కొత్తలో... అందరికంటే ముందుగా అది టీబీ పేషెంట్లకే వ్యాపిస్తుందని డాక్టర్లు అనుకున్నారు. తీరాచూస్తే... అందుకు విరుద్ధంగా జరుగుతోంది. టీబీ పేషెంట్లలో ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అవుతోందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే... టీబీలో మూడు రకాలున్నాయి. 1.ఆర్డినరీ టీబీ 2.మల్టీ డ్రగ్ రెసిస్టాన్స్ టీబీ (MDR), 3.ఎక్స్‌ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (XDR).

  సెవ్రీ ఆస్పత్రిలోని పేషెంట్లలో ఎక్కువ మంది 2, 3 టైపే. చాలా మందికి రెండు ఊపిరితిత్తులూ పాడయ్యాయి. అయినప్పటికీ వారికి కరోనా మాత్రం సోకట్లేదు. దీనిపై ఇప్పుడు ICMR లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. ఒకవేళ టీబీ రోగులకు ఇచ్చే మందుల వల్లే కరోనా రావట్లేదని తేలితే... వెంటనే అలాంటి మందుల్ని కరోనా వచ్చిన పేషెంట్లకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
  Published by:Krishna Kumar N
  First published: