Corona Dead bodies : కరోనా శవాన్ని రోడ్డుపై వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్ ...

కరోనా శవాన్ని రోడ్డుపై వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్ ...

Corona Dead bodies :కరోనా మృతులపై గ్రామాల్లో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది... కరోనా అంటేనే తమ గ్రామానికి శవాన్ని కూడ రానీయడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ కరోనా మృత దేహాన్ని ఊళ్లోకి రానీయకపోవడంతో పట్టణంలోని స్మశానవాటికకు తరలించారు.

  • Share this:
కరోనా మహామ్మారిపై ప్రజల్లో ఇంకా అవగాహాన లేమి కొరవడుతూనే ఉంది..దీంతో కరోనా అంటేనే బెంబెలెత్తుతున్న ప్రజల్లో అపోహలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు..ఇంకా మరికొంతమంది మాత్రం కరోనా అంటేనే డబ్బుల కోణంలో చూస్తూ..వైద్యం నుండి స్మశానవాటికల వరకు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.  కరోనా మృతదేహాలను కనీసం గ్రామాల్లోకి కూడ రానీయడం లేదు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు అంత్యంత మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇక అంబులెన్స్ డ్రైవర్స్ సైతం ఇదే ఒరవడిని చూపిస్తున్నారు..దేశ వ్యాప్తంగా ఇలాంటీ సంఘటనలు కొనసాగుతున్నా తాజాగా మరో హృదయ విదాయకరమైన సంఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది.

కరోనా మహామ్మారి మనుషులను అకారణంగా తీసుకుపోవడమే కాకుండా మానవ సంబంధాల్ని కూడ చెరిపివేస్తుంది..కరోనా భయంతో మానవీయతను మరచి అమానుషంగా వ్యవహరిస్తున్నారు..ఈ నేపథ్యంలోనే కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి శవాన్ని కనీసం ఊళ్లో దహాన సంస్కారాలకు అనుమతి ఇవ్వని సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

రాష్ట్రంలోని గడగ్ జిల్లా బస్‌లాపూర్‌కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అయితే ఆసుపత్రి సిబ్బంది కొవిడ్ మృతదేహానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించకుండా అంటే కనీసం పీపీఈ కిట్స్‌తో శవాన్ని కప్పివేయడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి వెళ్లి ఖననం చేద్దామనుకున్న కుటుంబ సభ్యులను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో.. చేసేదేమి లేక వారు తిరిగి అదే అంబులెన్స్‌లో సమీప పట్టణ ప్రాంతానికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

మరోవైపు బెంగుళూరో ఓ డ్రైవర్ డబ్బులు తక్కువ ఇవ్వడంతో కరోనా శవాన్నిఓ ఫుట్‌పాత్ వద్ద వదిలేసి వెళ్లిపోయిన సంఘటన వెలుగు చూసింది. కనీసం స్మశాన వాటికలో కాకుండా సమీపంలో రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు..అయితే డ్రైవర్ 10000 వేల రూపాయలు అడిగాడని , తమ వద్ద లేకపోవడతో మూడు రూపాయాలు ఇచ్చామని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతోనే మృతదేహాన్ని రోడ్డుపై వదలేసి వెళ్లిపోయాడని చెప్పారు.. కాగా స్థానికులు వచ్చి మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్లి ఖననం చేశారు.
Published by:yveerash yveerash
First published: