Andhra Pradesh: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. స్కూళ్లపై పంజా విసురుతోన్న కరోనా

Andhra Pradesh: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. స్కూళ్లపై పంజా విసురుతోన్న కరోనా

ప్రతీకాత్మక చిత్రం

కరోనా డేజంర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కువగా కేసులు నమోదవ్వడం ఆందోళన పెంచుతోంది. తాజాగా కడప లో ఓ ప్రైవేటు స్కూళ్లో 36 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే ఎలాంటి నిబంధనలు పాఠించకుండా స్కూళ్లు నడపంపై విద్యార్థుల తల్లి దండ్రులు మండిపడుతున్నారు.

  • Share this:
    ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలను కరనో కాటేస్తోంది.  మొదట రాజమండ్రిలో ఉన్న ఓ కాలేజీలో 175 మందికి కరోనా సోకగా.. తరువాత మరో 55 మందికి సోకింది దీంతో ఒక్క కాలేజీలోనే కరోనా సోకిని వారి సంఖ్య 230కి చేరింది. మరికొన్ని రోజులకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో కరోనా కలలకం సోకింది. 65 మంది మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక స్కూళ్ల సంగతి అలానే ఉంది. చాలా వరకు స్కూళ్లు యజమాన్యాలు బయటకు ప్రకటించకుండా గుట్టు చప్పుడు కాకుండా లెక్కలు దాచే ప్రయత్నం చేస్తున్నాయి.  అయినా స్కూళ్లలో పరిస్థితి భయపెడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

    corona danger bells in ap, 36 cases in one private school, cases increased schools and collegs, corona cases update, last 24 hours corona cases, corona tension in andhra pradesh, ఏపీలో కరోనా డేంజర్ బెల్స్, ఏపీని వెంటాడుతున్న కరోనా, స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కలవరం, కడపలోని ఓ స్కూళ్లో 36 మంది విద్యార్థులకు కరోనా, స్కూళ్లు, కాలేజీలపై కరోనా పంజా

    తాజాగా కడపలో కరోనా కలకలం రేపింది. నగరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో  36 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆ విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడేందుకు ప్రయత్నించింది. అయితే విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఐదో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థుల్లో 36 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

    Ap schools reopening News, Andhra Pradesh schools, Ap schools, schools reopening in February 1, cm ys jagan mohan reddy, ap news, ఏపీ స్కూల్స్ ప్రారంభం, ఏపీ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ప్రారంభం

    ఒకేసారి అంతమంది విద్యార్థులకు కరోనా సోకినా యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదని. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 36 మందికి కరోనా వచ్చినా కూడా.. రెడ్ జోన్ గా ప్రకటించకుండా.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా క్లాసులు నిర్వహిస్తుండడం దారుణమని మండిపడుతున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చినా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా క్లాసులు నిర్వహించడంపై ఆందోళన చెందుతున్నారు.Private Schools, Andhra Pradesh, Government, CM Pics, School Education, Corona Virus, Admissions, ప్రైవేటు స్కూల్స్, ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వం, సీఎం జగన్, పాఠశాల విద్య, కరోనా వైరస్, అడ్మిషన్లు,

    అయితే తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా తల్లి దండ్రుల్లో కలవరం మొదలైంది. రోజు రోజకూ పాఠశాల, కాళశాల విద్యార్థులకు కరోనా సోకుతుండడంతో.. విద్యార్థులను  పంపించాలా లేదా అన్నది తేల్చుకోలేకపోతున్నాు. దీనిపై గతంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఏపీలో స్కూళ్లు బంద్ చేసే ఆలోచన లేదని.. ఆన్ లైన్ క్లాస్ వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ప్రకటించింది.  కానీ ఆ ప్రకటన తరువాతే స్కూళ్లలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్న విద్యాసంస్థలను మాత్రం మూసివేయక తప్పని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం చెప్పింది. అయినా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. కాసుల కక్కుర్తి కోసం కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతుంటే..  బయటకు చెప్పకుండా ఎప్పటిలాగే స్కూళ్లు, కాలేజీలను నడుపుతున్నాయి. దీంతో  ఇతర విద్యార్థుల తల్లి దండ్రులు భయపడుతున్నారు. రేపు పొద్దున్న తమ పిల్లలకు ఏదైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు